మంగళవారం 31 మార్చి 2020
Adilabad - Feb 04, 2020 , 00:05:39

రైతులను అన్నివిధాలా ఆదుకుంటాం

రైతులను అన్నివిధాలా ఆదుకుంటాం

బేల/జైనథ్‌: రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామాని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. సోమవారం బేల మండలం కేంద్రంలోని సబ్‌మార్కెట్‌ యార్డ్‌లో రూ.92 లక్షలతో నిర్మించనున్న కవర్‌షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విధాలుగా ఆదుకునేందకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. 

ఇప్పటికే ప్రతి మండలంలో గిడ్డంగుల నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. బేల మండలంలో అభివృద్ధి కోసం రూ.80 కోట్లతో పనులు చేపట్టామని అన్నారు.

కందుల కొనుగొళ్లు ప్రారంభం

మండల కేంద్రంలోని సబ్‌మార్కెట్‌ యార్డులో, జైనథ్‌లోని మార్కెట్‌ యార్డులో సోమవారం ఎమ్యెల్యే జోగురామన్న కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలను పూర్తి మద్దతు ధరతో కొనుగోలు చేస్తామన్నారు. గతంలో సోయా, పత్తి పంటకు మద్దతు ధర కల్పించమన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ రావుత్‌ మనోహర్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా ఉపాధ్యాక్షుడు గంభీర్‌ఠాక్రే, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముక్కెర ప్రభాకర్‌, మర్కెట్‌ కమిటీ ఉపాధ్యాక్షుడు సుధాంరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్‌ అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల అందజేత

బేల మండల కేంద్రంలోని ప్రజా పరిషత్‌ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే జోగురామన్న అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.

కవర్‌షెడ్‌ ప్లాట్‌ఫాం నిర్మాణానికి భూమి పూజ

జైనథ్‌లో మార్కెట్‌కు రూ.92లక్షలతో కవర్‌షెడ్‌, రూ.60లక్షలతో ప్లాట్‌ఫాం నిర్మాణాలకు ఎమ్యెల్యే జోగు రామన్న భూమి పూజ చేశారు. రైతులు పండించిన పంటలను నిల్వ చేయడానికి వీటిని ఉపయోగిస్తామన్నారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌ ఎండీ పుల్లయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, మెట్టు ప్రహ్లాద్‌, రైతు మండల కన్వీనర్‌ లింగారెడ్డి, డైరెక్టర్‌ తల్లెల చంద్రయ్య, ఏవో వివేక్‌, ఐటీడీఏ డైరెక్టర్‌ పెందూర్‌ దేవన్న, సర్పంచ్‌ దేవన్న, ఎంపీటీసీ సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>