మంగళవారం 31 మార్చి 2020
Adilabad - Feb 04, 2020 , 00:05:05

ఆదిలాబాద్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

ఆదిలాబాద్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: ఆదిలాబాద్‌ను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని 49వార్డులో అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ.. పట్టణంలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణ పనులు చేపట్టామన్నారు. ప్రతి నెల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి ప్రజల సమస్యలను చర్చిస్తామన్నారు. కార్యక్రమంలో సంద నర్సింగ్‌, ప్రణయ్‌, నాయకులు గణేశ్‌, జాగృతి జిల్లా అధ్యక్షుడు రంగినేని శ్రీనివాస్‌, నాయకులు పాల్గొన్నారు.

స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి

ఆదిలాబాద్‌ రూరల్‌: స్వామి వివేకానంద చూపిన మార్గంలో నడవాలని మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అన్నారు. శ్రీ రామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో ఆదర్శ మహిళలు అనే అంశంపై యువతీయువకులకు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జోగు ప్రేమేందర్‌ హాజరై మాట్లాడారు. ప్రస్తుత యువత చెడు మార్గాలకు ఆకర్షితులవుతున్నారని అన్నారు. ఆదర్శ మహిళలు పుస్తకం ద్వారా సీతా, సావిత్రిల గురించి చక్కగా వివరించారన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణసేవాసమితి అధ్యక్షుడు ఆరె భూమన్న, ప్రధాన కార్యదర్శి కోరెడ్డి లెనిన్‌, కోశాధికారి కోటేశ్వర్‌రావు, ప్రఫుల్‌వాఝే, లస్మన్న తదితరులు పాల్గొన్నారు.

పరిశుభ్రత అందరి భాద్యత

పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి భాధ్యత అని మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు భాగంలో స్వచ్ఛభారత్‌లో భాగంగా పిచ్చిమొక్కలను తొలగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్త బుట్టలు, మున్సిపల్‌ వాహనాల్లో మాత్రమే వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అజయ్‌, బండారి సతీశ్‌, రాజు, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.


logo
>>>>>>