శనివారం 04 ఏప్రిల్ 2020
Adilabad - Feb 04, 2020 , 00:02:41

8న జాతీయ లోక్‌ అదాలత్‌

8న జాతీయ లోక్‌ అదాలత్‌

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: ఈనెల 8న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌లో కేసుల సత్వర పరిస్కారానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని తెలిపారు. సోమవారం కోర్టు కాంప్లెక్స్‌లో బ్యాంక్‌ ఇన్సూరెన్సు కంపెనీలు, ఆర్టీసీ, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధా న న్యాయమూర్తి ప్రియదర్శిణి మాట్లాడుతూ.. జాతీయ లోక్‌ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించాలని న్యాయవాదులకు సూచించారు. చెక్కు బౌన్స్‌, సివిల్‌, ఇతర కేసుల పరిష్కారానికి కక్షిదారుల మధ్య రాజీ కు దుర్చాలని అధికారులను ఆదేశించారు. గత లోక్‌ అదాలత్‌లో జిల్లా రాష్ట్రం లో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా జడ్జి శ్రీనివాసరావు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ భాస్కర్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మోహన్‌ సింగ్‌, పలువురు న్యాయవాదులు, బ్యాంక్‌ మేనేజర్లు, ఇన్సూరెన్సు కంపెనీల ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.


logo