గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Feb 03, 2020 , 01:12:37

‘సహకార’ సందడి

‘సహకార’ సందడి

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలో సహకార ఎన్నికల వేడి మొదలయ్యింది. సహకార ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు అధికారులు జిల్లా వ్యాప్తంగా ఉన్న 28 పీఏసీఎస్‌ల పరిధిలో 37,287 మంది ఓటర్లు ఉన్నట్లు ఆదివారం ప్రకటించారు. ఆదిలాబాద్‌ పీఏసీఎస్‌లో 13 మంది డైరెక్టర్‌ స్థానాలు ఉండగా 4,745 మంది ఓటర్లు ఉన్నారు. లాండసాంగి పీఏసీఎస్‌లో 13 మంది డైరెక్టర్లకు గాను 179 ఓటర్లు, చాంద(టి) పీఏసీఎస్‌లో 12 మంది డైరెక్టర్లకు గాను 409 ఓట్లరు, తంతోలి పీఏసీఎస్‌లో 13 మంది డైరెక్టర్లకు గాను 431, తలమడుగు పీఏసీఎస్‌లో 113 మంది డైరెక్టర్లకు గాను 2522, జరీ పీఏసీఎస్‌లో 13 మంది డైరెక్టర్లకు గాను 278, తాంసి పీఏసీఎస్‌లో 13 మంది డైరెక్టర్లకు గాను 2633, జామిడి 12 మంది డైరెక్టర్లకు గాను 176, హస్నాపూర్‌ 12 మంది డైరెక్టర్లకు గాను 203, జైనథ్‌ పీఏసీఎస్‌లో 13 మంది డైరెక్టర్లకు గాను 3264, మేడిగూడ పీఏసీఎస్‌లో 13 మంది డైరెక్టర్లకు గాను 465, గూడరాంపూర్‌ పీఏసీఎస్‌లో 13 నియోజక వర్గాలకు 325, బేలా పీఏసీఎస్‌లో 13 మంది డైరెక్టర్లకు గాను 2238, బోప్టాల 13 మంది డైరెక్టర్లకు గాను 639, జామిడి(బి) 13 మంది డైరెక్టర్లకు గాను 285, ఇచ్చోడ పీఏసీఎస్‌లో 13 మంది డైరెక్టర్లకు గాను 3805, ముక్రలో 13 మంది డైరెక్టర్లకు గాను 227, మాన్కాపూర్‌ 12 మంది డైరెక్టర్లకు గాను 61, గుడిహత్నూర్‌ పీఏసీఎస్‌లో 13 మంది డైరెక్టర్లకు గాను 1453, మన్నూర్‌ పీహెచ్‌సీలో 13 డైరెక్టర్లకు గాను 614, నర్సానూర్‌ పీఏసీఎస్‌లో 13 డైరెక్టర్లకు గాను 178, నేరడిగొండ పీఏసీఎస్‌లో 13 డైరెక్టర్లకు గాను 2203, కుమారీ పీఏసీఎస్‌లో 13 డైరెక్టర్లకు గాను 403, బోథ్‌ పీఏసీఎస్‌లో 13 నియోజక వర్గాలకు 2384, బజార్‌హత్నూర్‌ పీఏసీఎస్‌లో 13 డైరెక్టర్లకు గాను 2135, ఉట్నూర్‌ పీఏసీఎస్‌లో 13 డైరెక్టర్లకు గాను 1500, ఇంద్రవెల్లి పీఏసీఎస్‌లో 13 డైరెక్టర్లకు గాను 1702, నార్నూర్‌ పీఏసీఎస్‌లో 13 డైరెక్టర్లకు గాను 1830, జిల్లా వ్యాప్తంగా ఉన్న 28 పీఏసీఎస్‌కు గాను 360 డైరెక్టర్ల పరిధిలో మొత్తం 37,287 మంది ఓటర్లు ఉన్నారు. 


రిజర్వేషన్లు ఇలా.. 

సహకార ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఏర్పాట్ల ప్రక్రియను వేగవంతం చేశారు. సోమవారం నోటిఫికేషన్‌ వెలువడనుండగా ఓటరు తుది జాబితాను సిద్ధం చేసి రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 360 డైరెక్టర్ల పరిధిలో ఈనెల 15న ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అందుకు సంబంధించిన రిజర్వేషన్లను ఆదివారం ప్రకటించారు. ఓటర్ల సంఖ్యను బట్టి ఒక్కో పీఏసీఎస్‌ పరిధిలో 12 నుంచి 13 మంది డైరెక్టర్లకు అవకాశం కల్పించారు. వీటిలో రెండు ఎస్సీ (ఒకటి మహిళ, ఒకటి జనరల్‌), ఒకటి ఎస్టీ జనరల్‌, రెండు బీసీ జనరల్‌, ఒకటి జనరల్‌ మహిళ, ఏడు స్థానాలను జనరల్‌కు కేటాయించారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తమ పరిధిలోని ఓటర్లను కలుస్తున్నారు. గతంలో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో తీవ్ర పోటీ ఉంటుందని బావిస్తున్నారు. ఇప్పటికే ఆశావహులు అధినేతలను మచ్చిగా చేసుకొనే పనిలో పడ్డారు. 


డిఫాల్టర్ల తొలగింపు.. 

సహకార ఎన్నికల సందడి మొదలవడంతో బరిలో నిలువాలనుకుంటున్న అభ్యర్థులు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో అభ్యర్థులు పోటీ చేయడానికి అర్హతలకు సబంధించి అంశాలను సహకార శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌, ఎన్నికల అధికారి సుమిత శుక్రవారం వెల్లడిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కనీసం సబంధిత సొసైటీలో ఏడాది సీనియారిటీ కలిగి ఉండాలని, సొసైటీకి ఎలాంటి బకాయి ఉండరాదన్నారు. బకాయి ఉంటే నామినేషన్‌ దాఖలుకు ముందే మొత్తం చెల్లించాలని సూచించారు.. సొసైటీ నిధులు దుర్వినియోగం చేసిన వారు పోటీకి అనర్హులన్నారు. గత పాలక మండలిలో సభ్యులుగా ఉండి ఏదైనా కారణంతో తొలగించబడినవారు పోటీకి అనర్హులని తెలిపారు. పోటీ చేయాలనుకునే వ్యక్తిపై సొసైటీకి సంబంధించిన ఎలాంటి కేసులు పెడింగ్‌ ఉండకూడదన్నారు.


logo