బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Feb 03, 2020 , 01:07:51

ముగిసిన అంతఃప్రజ్ఞ

ముగిసిన అంతఃప్రజ్ఞ
  • విజయవంతం చేసిన ట్రిపుల్‌ఐటీ సిబ్బందికి వీసీ అభినందన

బాసర : బాసర ట్రిపుల్‌ఐటీ కళాశాలలో మూడు రోజులుగా జరుగుతున్న అంతఃప్రజ్ఞ ఆదివారంతో ముగిసింది. చివరి రోజు వీసీ అశోక్‌కుమార్‌ ఫిజిక్స్‌, మ్యాథమెటిక్స్‌, కెమిస్ట్రీ, ఈసీఈ, ఈఈఈ తదితర విభాగాలను సందర్శించి ప్రాజెక్టుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పలు విభాగాల్లో ఎంపికైన ప్రాజెక్టులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం కోసం రెండు నెలల నుంచి రాత్రింబవళ్లూ కష్టపడిన హెచ్‌వోడీలు, కన్వీనర్లు, కో-కన్వీనర్లు, ఫ్యాకల్టీ కో-ఆర్డినేటర్లు, విభాగాల కో-ఆర్డినేటర్లను అభినందించారు. 


ఆటపాటలతో హోరెత్తిన ట్రీపుల్‌ఐటీ..

అంతఃప్రజ్ఞ కార్యక్రమంలో భాగంగా శనివారం అర్ధరాత్రి వరకు త్రినయన కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో హోరెత్తించారు. వెస్టర్న్‌, సినీ గీతాలపై డ్యాన్సులు, సంప్రదాయ నృత్యాలు అలరించాయి. 


logo