గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Feb 03, 2020 , 01:07:10

ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: ఆదిలాబాద్‌ మండలంలోని బంగారుగూడ ఆదర్శ పాఠశాలలో 6నుంచి 10వతరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ సుధారాణి ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతిలో100 సీట్లు, 7,8,9,10వ తరగతుల్లో మిగిలిన సీట్లకు ప్రవేశం కల్పిస్తామని పేర్కొన్నారు. 6వ తరగతి కోసం ఈ నెల 3 నుంచి 29వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 7 నుంచి 10వ తరగతి అభ్యర్థులు ఈ నెల 7వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 


ఓసీ అభ్యర్థులు రూ.150, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.75 చెల్లించాలని తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన కాపీతో కుల, నివాస, ఆదాయం, ఆధార్‌, బోనాఫైడ్‌ జిరాక్సులు జతచేసి మర్చి 2వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పాఠశాలలో అందజేయాలని సూచించారు. హాల్‌టికెట్లను ఏప్రిల్‌ 9 నుంచి 12 వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. ప్రవేశ పరీక్ష 6వ తరగతికి ఏప్రిల్‌ 12న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని తెలిపారు.  7 నుంచి 10వ తరగతులకు ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని తెలిపారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. logo