బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Feb 03, 2020 , 00:52:27

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

 పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

గుడిహత్నూర్‌ రూరల్‌ :  వారంతా 38 ఏండ్ల తర్వాత ఒక్క చోట కలిశారు.. ఆత్మీయంగా పలకరించుకుని  క్షేమ సమాచారాలను తెలుసుకున్నారు.. ఎన్నేండ్లయ్యిందో కలుసుకొని అంటూ పరస్పర కరచలనాలతో ఆనందం వ్యక్తం చేశారు.. వారే మండలంలోని మన్నూర్‌ గ్రామంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో 1981-82 బ్యాచ్‌ 10వ తరగతి విద్యార్థులు. ఆదివారం పూర్వవిద్యార్థులు స్థానిక జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో సమావేశమయ్యారు. తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. నాటి జ్ఞాపకాలను గరించి ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులతో సంతోషంగా మాట్లాడుకున్నారు. 30 మంది విద్యార్థులు 8 మంది టీచర్లు కలసి ఆత్మీయంగా పలకరించుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు.  మరణించిన పూర్వ స్నేహితులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా  రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయుడు మహేశ్‌ మాట్లాడుతూ.. పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు సమ్మెళనం ఏర్పాటును చేయడం గర్వంగా ఉందని అన్నారు. అనంతరం అందరూ సహపంక్తి భోజనాలు చేశారు.  కార్యక్రమంలో శివాజీ, రఘు, సలీమ్‌, రాజేశ్వర్‌, శ్రీనివాస్‌ ముండె, గోవింద్‌రావు, చంద్రశేఖర్‌,  శివాజీ, విఠల్‌రావు, మహేశ్‌, ఆనంద్‌ రావు, రాంచంద్రరావు, సుమన్‌బాయి తదితరులు పాల్గొన్నారు.


logo