మంగళవారం 07 ఏప్రిల్ 2020
Adilabad - Feb 02, 2020 , 00:18:08

‘పది’లో మెరుగైన ఫలితాలు సాధించాలి

‘పది’లో మెరుగైన ఫలితాలు సాధించాలి

నార్నూర్‌: పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యార్థులపై దృష్టి సారించాలని ఐటీడీఏ డీడీ చందన సూచించారు. శనివారం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత బాలికల పాఠశాలను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. అనంతరం విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. వార్షిక పరీక్షలంటే భయం వీడి ప్రణాళిక ప్రకారం చదువుకోవాలని అన్నారు. ఏవైనా సందేహాలుంటే వెంటవెంటనే ఉపాధ్యాయుల ద్వారా నివృత్తి చేసుకోవాలని సూచించారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదవుకోవాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి సబ్జెక్టులో విద్యార్థులు పట్టు సాధించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు.


logo