మంగళవారం 07 ఏప్రిల్ 2020
Adilabad - Feb 02, 2020 , 00:18:08

గ్రూప్‌-4 బ్యాక్‌లాగ్‌ ప్రొవిజనల్‌ జాబితా విడుదల

గ్రూప్‌-4 బ్యాక్‌లాగ్‌ ప్రొవిజనల్‌ జాబితా విడుదల

ఎదులాపురం: షెడ్యూల్ట్‌ కులాలు, తెగలకు సంబంధించిన గ్రూప్‌-4బ్యాక్‌ లాగ్‌ ఖాళీల భర్తీకి అభ్యర్థుల ప్రొవిజనల్‌ జాబితా విడుదల చేసినట్లు కలెక్టర్‌ దివ్వాదేవరాజన్‌  ఒక ప్రకటనలో తెలిపారు. జూన్‌ 2018 సంవత్సరంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్ట్‌ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను adilabad.telangana.gov.in వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశామని పేర్కొన్నారు. ఎమైనా అభ్యంతరాలు ఉంటే ఏడు రోజుల్లోగా కలెక్టరెట్‌ కార్యాలయంలో లిఖితపూర్వకంగా అందజేయాలని సూచించారు. అభ్యంతరాలు రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయన్ని అభ్యర్థులు గమనించాలని పేర్కొన్నారు.


logo