శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Adilabad - Feb 02, 2020 , 00:07:59

నేటి నుంచి కందుల కొనుగోళ్లు ప్రారంభం

నేటి నుంచి కందుల కొనుగోళ్లు ప్రారంభం

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలో కంది పంటను పండించిన రైతులకు మార్క్‌ఫెడ్‌ ద్వారా కనీస మద్దతు ధర కల్పించి కొనుగోళ్లు చేపడుతామని కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శనివారం వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో 23,803 హెక్టార్లలో కంది పంట సాగు జరిగిందన్నారు. 2,22,775 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశముందని ఆంచచా వేసినట్లు తెలిపారు. నాణ్యత, తక్కువ తేమశాతం కలిగిన కందులను తీసువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. దీనిపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. మండలు, గ్రామాల వారీగా కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధ్దం చేయాలన్నారు. 


మధ్య దళారుల ప్రమేయం లేకుండా రైతులు నేరుగా మార్కెట్‌కు తీసుకరావాలన్నారు. క్రాప్‌ బుకింగ్‌  ప్రకారం కంది సాగు చేసిన రైతులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి అక్రమ రవాణా జరుగకుండా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అక్రమ నిల్వలు చేసేవారిపై కేసులు నమోదు చేయాలని అన్నారు. కౌలు రైతుల జాబితాలను సేకరించి ధ్రువీకరణ పత్రాలను అందజేయాలన్నారు. ఒక సర్వే నెంబర్‌పై ఒక్కరికి మాత్ర మే ధ్రువీకరణ పత్రం ఇవ్వాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 10 కొనుగోళు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. క్వింటాలుకు రూ. 5800 చెల్లించనున్నట్లు తెలిపారు.  సమావేశంలో సంయుక్త కలెక్టర్‌ సంధ్యారాణి, మార్క్‌ఫెడ్‌ మేనేజర్‌ పుల్లయ్య, వ్యవసాయ అధికారి శివకుమార్‌, ఇన్‌చార్జి మార్కెటింగ్‌ అధికారి అశ్వాఖ్‌, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. 


logo