గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Jan 31, 2020 , 01:01:49

ఎన్‌పీఆర్‌డీ క్యాలెండర్‌

ఎన్‌పీఆర్‌డీ క్యాలెండర్‌

ఎదులాపురం : జిల్లా దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) నూతన క్యాలెండర్‌ను ఎమ్మెల్యే జోగురామన్న గురువారం ఆయన నివాసంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దివ్వాంగుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. దేశంలో ఏరాష్ట్రంలోలేని విధంగా పింఛన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌అని గుర్తుచేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌,  వైస్‌ చైర్మన్‌ జహీర్‌ రంజానీ, టీఆర్‌ఎస్‌ నాయకులు సాజీదుద్దీన్‌, కౌన్సిలర్‌ బండారి సతీశ్‌,  ఎన్‌పీఆర్‌డీ జిల్లా అధ్యక్షుడు ఇమ్రాన్‌ తదితరలు పాల్గొన్నారు.


అనాథలను ఆదుకోవాలి

ఎదులాపురం : అనాథ పిల్లల హక్కుల కోసం ప్రపంచంలో ఉన్న వివిధ రకాల సంస్థలు పని చేసున్నాయని  స్వాస్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ప్రణయ్‌ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో అనాథ పిల్లలకు సహాయం చేయాలని నిర్వహించిన కార్యక్రమం వాల్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదిలాబాద్‌ జిల్లాలోని అనాథ పిల్లలను ఆదుకునేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో విజయ్‌ చందూర్‌, ఎంపీటీసీ కల్యాణ్‌ తదితరులు ఉన్నారు.


logo