ఆదివారం 29 మార్చి 2020
Adilabad - Jan 31, 2020 , 01:00:42

హరితహారం మొక్కలపై నిర్లక్ష్యం వద్దు

హరితహారం మొక్కలపై నిర్లక్ష్యం వద్దు

బేల :  గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న నర్సరీల్లో మొక్కలపై నిర్లక్ష్యం చేయకూడదని ఏపీడీ కృష్ణారావు అన్నారు. మండలంలోని సాంగిడి గ్రామ నర్సరీని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంపై నిర్లక్ష్యం వహించకుండా గ్రా మాల్లో మొక్కల పెంపకంపై దృష్టి సారించాలన్నారు. గ్రామంలో ఏర్పాటు చేస్తున్న నర్సరీల్లో ఇప్పటి నుంచే మొక్కల పెంపకం ప్రారంభించాలని వచ్చే జూన్‌, జూలై నెలలో హరితహారంలో నాటేలా పెంచాలన్నారు. నర్సరీలపై నిర్లక్ష్యం వహించకూడదన్నారు. గతంలో నాటిన మొక్కలకు ప్రతిరోజు నీరు పోయించాలన్నారు.  ఆయన వెంట ఈసీ దీపక్‌, గ్రామ యువజన సంఘం సభ్యుడు కన్నాల మహేందర్‌ ఉన్నారు. 


logo