సోమవారం 06 ఏప్రిల్ 2020
Adilabad - Jan 31, 2020 , 00:51:45

గాంధీ చూపిన మార్గంలో నడవాలి

గాంధీ చూపిన మార్గంలో నడవాలి

ఆదిలాబాద్‌ రూరల్‌ : మహాత్మగాంధీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వెంకట్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్‌ కార్యాలయంలో మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులనుద్దేశించి మాట్లాడు తూ గాంధీ లౌకికవిధానాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. భారతీయ విలువలు, సంస్కృతి సంప్రదాయాలు కాపాడిన మహానుభావుడన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులు లక్ష్మణ్‌రావు, సభ్యులు అశోక్‌, స్వామి, విఠల్‌గౌడ్‌, విలాస్‌, సుజా త, గణేష్‌, అశోక్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.


మున్సిపల్‌ చైర్మన్‌ను కలిసిన యూటీఎఫ్‌ నాయకులు

ఆదిలాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ను యూటీఎఫ్‌ నాయకులు కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణం అభివృద్ధితో పాటు పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని ఆయనను కోరారు. 


logo