గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Jan 30, 2020 , 00:07:49

నాగోబా భక్తజన సందోహం

నాగోబా భక్తజన సందోహం

ఇంద్రవెల్లి : మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో 24న అర్ధరాత్రి నిర్వహించిన మహాపూజలతో ప్రారంభమైన కెస్లాపూర్‌ నాగోబా జాతర ఐదోరోజు కొనసాగింది. బుధవారం ఉమ్మడి జిల్లాతోపాటు పలు ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు కెస్లాపూర్‌కు తరలివచ్చి నాగోబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్బార్‌ కావడంతో ఆదివాసీ గిరిజనులు, భక్తులు వేలాదిగా తరలిరావడంతో నాగోబా ఆలయం కిటకిటలాడింది. 


బేతాల్‌దేవతకు పూజలు

నాగోబా ఆలయ ఆవరణలో మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో బేతాల్‌దేవతకు సంప్రదాయ పూజలు నిర్వహించారు. నాగోబాతోపాటు సతీదేవతలను దర్శించుకున్న భక్తులు వేసిన పవుడి డబ్బులు (కానుకల)ను పటేల్‌ కిత్త, కటోడ కిత్త, పర్ధంజీ కిత్తల వారీగా పంచుకున్నారు. ప్రసాదంతోపాటు కొబ్బరికాయలు, ప్రమిదలు, మట్టికుండలను మెస్రం వంశీయులతోపాటు వారి బంధువులకు పంపిణీ చేశారు. అనంతరం సంప్రదాయం ప్రకారం మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్‌పటేల్‌ కాగడాలను వెలిగించి బేతాల్‌పూజలను ప్రారంభించారు. నేలపై తంబా కు వేసి అక్కడి నుంచే నాగోబాను మొక్కుకున్నారు. గోవా డ్‌ పక్కన పటేల్‌ గాది ఏర్పాటు చేసి, బేతాల్‌దేవత పూజల పై మెస్రం వంశీయులతోపాటు మహిళలకు వేర్వేరుగా ప ర్దాంజీలు తుకోడోజీ, దాదారావ్‌ వివరించారు. గోవాడ్‌ ముందర మెస్రం వంశ మహిళలు మెస్రం పెద్దల పాదాలను నీటితో కడిగారు. మండగాజిలింగ్‌ సంప్రదాయ ప్రత్యే క పూజలు నిర్వహించి, నాగోబా పూజలకు ముగింపు పలికారు. అనంతరం మహాపూజలకు వాడిన మట్టి కుండలను 22 కితలకు పంపిణీ చేశారు. సాయంత్రం కెస్లాపూర్‌ నుంచి కుటుంబసమేతంగా ఎడ్లబండ్లతో ఉట్నూర్‌ మండలంలోని శ్యామ్‌పూర్‌ గ్రామంలోని బుడుందేవు జాతర పూజల కో సం బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయు లు వెంకట్‌రావ్‌పటేల్‌, చిన్నుపటేల్‌, బాధిరావ్‌, లింబారావ్‌పటేల్‌, కటోడకోశరావ్‌, తుకోడోజీ, కోటోడ హనుమంత్‌రావ్‌, తీరుపతి, దాదారావ్‌, గణపతి, పాల్గొన్నారు.


గిరిజనులకు సబ్సిడీ పథకాలు పంపిణీ

ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ గిరిజనులకు ఐటీడీఏ ద్వారా మంజూరు చేసిన సబ్సిడీ సంక్షేమ పథకాలను రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సోయం బాపురావ్‌, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ వెంకటేశ్వర రెడ్డి, కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌, ఎస్పీ విష్ణువారియర్‌, ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య పంపిణీ చేశారు. ఆసిఫాబాద్‌ జిల్లాలోని నవగూడ గ్రా మానికి చెందిన 11 మంది గిరిజన రైతులకు ఐటీడీఏ ద్వారా రూ.7లక్షల70వేలతో మంజూరు చేసిన ఎడ్లబండ్లతోపాటు ఎడ్లజతలను పంపిణీ చేశారు. బీర్సాయిపేట్‌కు చెందిన నలుగురికి కుట్టుమిషన్‌లను అందజేశారు.

వెల్లువెత్తిన దరఖాస్తులు

నాగోబా జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన దర్బార్‌లో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ప్రజా ఫిర్యాదుల విభాగంలో దరఖాస్తులను అధికారులకు అందించారు. దరఖాస్తుల స్వీ కరణకు కౌంటర్లను ఏర్పాటు చేశారు. వచ్చిన దరఖాస్తుల ను ఆన్‌లైన్‌లో నమోదుచేశారు. అన్ని శాఖలకు చెందిన అధికారులు ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఉండే విధంగా కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు. జాతర సందర్భంగా ఎస్పీ విష్ణువారియర్‌తోపాటు ఉట్నూర్‌ ఏఎస్పీ శబరీష్‌ ఆధ్వర్యంలో భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. దర్బార్‌లో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 


logo
>>>>>>