మంగళవారం 31 మార్చి 2020
Adilabad - Jan 29, 2020 , 22:36:56

అభివృద్ధ్దిలో ఆదర్శంగా నిలుపుతా..

అభివృద్ధ్దిలో ఆదర్శంగా నిలుపుతా..

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : పట్టణాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతానని మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అన్నారు. భుక్తాపూర్‌ వార్డు కౌన్సిలర్‌ బండారి సతీశ్‌తోపాటు యూత్‌ నాయకులు బుధవారం చైర్మన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా 49 వార్డులను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి వార్డులో పర్యటించి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. పట్టణ ప్రజలకు రాబోవు రోజులన్నీ మంచి రోజులేనన్నారు. శాఖల వారీగా అధికారులను ప్రజలకు అందుబాటులో ఉంచి మెరుగైన సేవలు అందేలా చేస్తామన్నారు. పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తామన్నారు. రానున్న వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో కాలనీవాసులు, యువజన నాయకులు పాల్గొన్నారు.  

మున్సిపల్‌ చైర్మన్‌కు సన్మానం

ఎదులాపురం : మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికైన జోగు ప్రేమేందర్‌ను బుధవారం స్థానిక శాంతినగర్‌లోని ఆయన నివాసంలో బీసీ గురుకులాల ఉమ్మడి జిల్లా ఆర్సీవో గోపిచంద్‌ రాథోడ్‌ కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా భవిష్యతులో ఉన్నత స్థాయి పదవులు పొందాలన్నారు. తండ్రి బాటలో నడుస్తూ ప్రజా సంక్షేమానికి అహర్నిశలు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఆయన వెంట గురుకులాల సిబ్బంది సాయి తదితరులు ఉన్నారు. 


logo
>>>>>>