బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Jan 29, 2020 , 00:19:50

సురక్షిత డ్రైవింగ్‌తో ప్రమాదాల నివారణ

సురక్షిత డ్రైవింగ్‌తో ప్రమాదాల నివారణ

బేల: సురక్షిత డ్రైవింగ్‌తోనే ప్రమాదాల నివారణ సాధ్యమని ఎస్సై సాయన్న అన్నారు. మండల కేంద్రంలో ఆర్టీఏ ఆధ్వర్యంలో 31వ జాతీయ భద్రత వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏవీఎంఐలు శ్రీనివాస్‌, మహేశ్‌తో పాటు ఎస్సై హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. అజాగ్రత్తతోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు.  రోడ్డు ప్రమాదాల్లో ఏటా దేశంలో లక్షల మంది మృతి చెందుతున్నారని గుర్తు చేశారు.   మద్యం తాగి వాహనాలు నడపడం నేరమని, మత్తులో ప్రమాదాలకు అవకాశాలు ఎక్కువని తెలిపారు. కార్యక్రమంలో విజ్ఞాన్‌ హైస్కూల్‌ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.  

రోడ్‌సేఫ్టీపై డ్రాయింగ్‌ పోటీలు..

ఆదిలాబాద్‌ రూరల్‌ : జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఆర్టీసీ  ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు రోడ్‌సేప్టీ అంశంపై డ్రాయింగ్‌, పెయింటింగ్‌ పోటీలు నిర్వహించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెం.1లో 50 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయురాలు నీలాదేవి మాట్లాడుతూ.. ఈ పోటీలతో విద్యార్థులకు రోడ్‌ సేఫ్టీపై అవగాహన కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌ నంద, ఉపాధ్యాయులు మాధవీలత, విజయ తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలి..

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ:  పట్టణంలో పలు కూడళ్లలో డ్రైవర్లకు ట్రాఫిక్‌ సీఐ అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని సూచించారు. వాహనాలకు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఎస్సై బాఖీ, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. 

జైనథ్‌ మండలంలో..

జైనథ్‌:  మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలతోపాటు బోరజ్‌ చెక్‌పోస్టు వద్ద ట్రాఫిక్‌ రూల్స్‌పై ఎస్సై సాయి వెంకన్న అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎంవీఐలు మహేశ్‌, శ్రీనివాస్‌, ఏఎస్సై జీవన్‌కుమార్‌ పాల్గొన్నారు. logo