శనివారం 04 ఏప్రిల్ 2020
Adilabad - Jan 29, 2020 , 00:14:39

మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
బేల: మహిళా సంఘాల సభ్యులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఐకేపీ డీపీఎం గంగన్న సూచించారు. మండలంలోని డోప్టాల గ్రామంలో మంగళవారం మహిళా సంఘాల సభ్యులతో రెండో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సమావేశంలో కొత్త విషయాలపై అవగాహన కల్పిస్తామన్నారు.  గర్భిణులు ప్రసవం అనంతరం రెండేండ్ల వరకు మొత్తం వెయ్యి రోజులపాటు ప్రతి రోజూ పౌష్టికాహారం తీసుకోవాలన్నారు.  నిరుద్యోగ యువతను గుర్తించి టీటీడీసీలో సెర్ప్‌, డీఆర్డీఏ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం కిరణ్‌కుమార్‌, సీసీ శరత్‌రెడ్డి, వీవోఏలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. 

రుణాలు సక్రమంగా చెల్లించాలి..

జైనథ్‌: మహిళా సంఘాల సభ్యులు గతంలో తీసుకున్న స్త్రీనిధి రుణాలను సక్రమంగా చెల్లించాలని ఏపీఎం చంద్రశేఖర్‌ అన్నారు. మండల కేంద్రంలోని చంద్రోదయ, కృష్ణవేణి గ్రామ సంఘాల సభ్యులకు మంగళవారం రుణాల చెల్లింపులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో సభ్యులు తీసుకున్న స్త్రీనిధి రుణాలతో పాటు బ్యాంకు రుణాలు సైతం బకాయిపడినట్లు గుర్తు చేశారు. సక్రమంగా చెల్లించక వడ్డీలేని రుణాలను పొందలేకపోతున్నారని తెలిపారు.  ఆయన వెంట స్త్రీనిధి మేనేజర్‌ సృజేందర్‌, సీసీలు తుమ్మల శ్రీనివాస్‌రెడ్డి, గోక శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మి, వీవోఏలు ప్రవీణ్‌, మహేశ్‌, సురేశ్‌, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. 


logo