శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Adilabad - Jan 27, 2020 , 23:27:45

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించిన ఎస్పీ

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించిన ఎస్పీ

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : సూర్యపేట కలెక్టర్‌ డి. అమోయి కుమార్‌ చేసిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను జిల్లా ఎస్పీ విష్ణు వారియర్‌ స్వీకరించారు. సోమవారం ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో పోలీసు అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన ఉట్నూర్‌ ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య, ఏఎస్పీ ఉట్నూర్‌ శబరీష్‌, డీఎఫ్‌వో ప్రభాకర్‌కు గ్రీన్‌ చాలెంజ్‌ చేశారు. 

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను సంరక్షించే భాద్యత తీసుకోవాలన్నారు.  పర్యావర పరిరక్షణకు ప్రతి పౌరుడు మొక్కలు నాటాలని సూచించారు. సూర్యపేట కలెక్టర్‌ ఇచ్చిన చాలెంజ్‌ను స్వీకరించి తాను మొక్కలు నాటి మరో ముగ్గురికి చాలెంజ్‌ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం చేపట్టి గొలుసుకట్టు మొక్కలు నాటడం అద్భుతమైన ప్రణాళిక అని కొనియాడారు. చెట్టు మానవాళి మనుగడకు జీవనాధారమని  ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటిని సంరక్షించడం అంతే ప్రధానమని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి అడవుల జిల్లాకు పూర్వవైభవం తీసుకురావాలని సూచించారు. అడవుల సంరక్షణకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు.  కార్యక్రమంలో శిక్షణ ఐపీఎస్‌ అధికారి హర్షవర్ధ్దన్‌ శ్రీవాస్తవ్‌, డీఎస్పీలు వెంకటేశ్వరరావు, ఆర్‌ఎస్సై సయ్యద్‌ సుజాదొద్దీన్‌, సుధాకర్‌ రావు, ఇంద్రవర్ధన్‌, పోలీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పెంచాల వెంటేశ్వర్లు, సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు. logo