శనివారం 04 ఏప్రిల్ 2020
Adilabad - Jan 27, 2020 , 23:26:50

వాయిదాలు సకాలంలో చెల్లించాలి

వాయిదాలు సకాలంలో చెల్లించాలి

బేల :  మహిళా సంఘాలు 2007 సంవత్సరంలో  తీసుకున్న రుణాలను ఈనెల చివరిలోగా చెల్లించాలని బ్యాంక్‌ మేనేజర్‌ రాజు, ఐకేపీ ఏపీఎం కిరణ్‌కుమార్‌ అన్నారు. సోమవారం బేల మండలంలోని సిర్సన్న గ్రామంలో మొండి బకాయిలు ఉన్న సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు ఇంటింటికీ వెళ్లి గతంలో తీసుకున్న రుణాలను చెల్లించాలని సభ్యులకు సూచించారు. పదేండ్ల క్రితం తీసుకున్న సభ్యులు ఇప్పటి వరకు రుణాలు చెల్లించకపోవడంతో వడ్డీ పెరుగుతుందన్నారు. చెల్లించిన సంఘాలకు వెంటనే రుణాలను అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఫీల్డ్‌ ఆఫీసర్‌ సతీశ్‌, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

రుణాలు చెల్లించాలి

జైనథ్‌ : మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలను ప్రతి నెలా చెల్లించాలని మండల సమాఖ్య అధ్యక్షురాలు రూప సూచించారు. మండల కేంద్రంలోని ఇందిరమ్మ మండల సమాఖ్య కార్యాలయంలో గ్రామ సంఘం ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సంఘాలు తీసుకున్న రుణాలు బకాయి పడ్డాయని తద్వారా వడ్డీలేని రుణాన్ని పొందలేక పోతున్నారన్నారు. సమావేశంలో మండల సమాఖ్య కార్యదర్శి రాధ, ఐకేపీ సిబ్బంది తుమ్మల శ్రీనివాస్‌రెడ్డి, నాందేవ్‌, గంగారాం, అకౌంటెంట్‌ లక్ష్మి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. logo