సోమవారం 30 మార్చి 2020
Adilabad - Jan 27, 2020 , 23:26:50

ఏకపక్ష నిర్ణయాలతోనే బీజేపీ ఓటమి

ఏకపక్ష నిర్ణయాలతోనే బీజేపీ ఓటమి

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ ఏకపక్ష నిర్ణయాలతో బల్దియా ఎన్నికల్లో పలు వార్డుల్లో ఓటమి చెందామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రింట్‌ మీడియా ప్రెస్‌క్లబ్‌లో  సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల తర్వాత అభ్యర్థుల ఎంపికకు కోర్‌ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. పార్టీలో పనిచేసిన వారు, ప్రజాధరణ పొందిన వారిని గుర్తించి టికెట్లు ఇవ్వాలని అధిష్టానం సూచించిందని తెలిపారు. కానీ జిల్లా అధ్యక్షుడు తన కొడుకు చెప్పిన వారికి టికెట్లు ఇచ్చారని అన్నారు. తాము గెలిచే చోట ఓటమి చెందామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై రాష్ట్ర నాయకత్వానికి సైతం ఫిర్యాదు చేశామన్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్ర నాయకుడి అండదండలతో పాయల శంకర్‌ పార్టీ సీనియర్‌ నాయకులను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. తామందరం ఎంపీ సోయం బాపురావు నాయకత్వంలో పనిచేస్తామని పేర్కొన్నారు. వెంటనే రాష్ట్ర నాయకులు పాయల శంకర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు మండల అధ్యక్షులు, జిల్లా నాయకులందరం వంద మందికి పైగా పార్టీ పదవులకు రాజీనామా చేసి కార్యకర్తలుగా కొనసాగుతామన్నారు. త్వరలో ఢిల్లీకి వెళ్లి జిల్లా అధ్యక్షుడిపై ఫిర్యాదు చేస్తామన్నారు. బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగినా సరైన అభ్యర్థులను గుర్తించపోవడంతోనే ఓటమి పాలవుతున్నామని తెలిపారు. వెంటనే అధిష్టానం పాయల  శంకర్‌ను తొలగించి పార్టీని కాపాడాలని కోరారు.  ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో బీజేపీ బలపడుతన్నదని తెలిపారు.  సమావేశంలో నారాయణ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడె మానాజి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెందూర్‌ ప్రభాకర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, బోథ్‌ అసెంబ్లీ ఇన్‌చార్జి కదం బాబారావ్‌, మాధవ్‌రావు, సామ సంతోష్‌, గందె విజయ్‌ కుమార్‌, గందె కృష్ణకుమార్‌, ముక్కెర శ్రీనివాస్‌, దీపక్‌ సింగ్‌, శివాజీ తదితరులు పాల్గొన్నారు. logo