గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Jan 27, 2020 , 23:16:04

కలెక్టర్‌, ఎస్పీని సన్మానించిన రైతు సంఘం సభ్యులు

కలెక్టర్‌, ఎస్పీని సన్మానించిన రైతు సంఘం సభ్యులు

నార్నూర్‌ : మండలంలోని ఉపమార్కెట్‌ యార్డులో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో రైతులు మద్దతు ధర లభించిందని రైతు సంఘం సభ్యులు జాదవ్‌ రెడ్డి నాయక్‌, మెస్రం బాదిరావ్‌ అన్నారు. సోమవారం ఆదిలాబాద్‌లో కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌,ఎస్పీ విష్ణు వారియర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఈ ఏడాది నార్నూర్‌లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయడంతో పంటకు మద్దతు ధర లభించిందని, సీసీఐ ఏర్పాటు చేసేలా కృషి చేసిన కలెక్టర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రైతులు మాల్కు పటేల్‌, జంగు, ప్రభాకర్‌, శ్రీరామ్‌, మానిక్‌రావ్‌ తదితరులు పాల్గొన్నారు.logo