శనివారం 04 ఏప్రిల్ 2020
Adilabad - Jan 27, 2020 ,

మువ్వన్నెల రెపరెపలు

మువ్వన్నెల రెపరెపలు

ఆదిలాబాద్‌ రూరల్‌ : 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా కేంద్రంలోని పరేడ్‌ మైదానంలో అట్టహాసంగా కొనసాగాయి. కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ మువ్వన్నెల జెండాలను ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. పోలీసు, ఎన్‌సీసీ, ఎస్పీసీ కేడెట్ల గౌరవ వందనం ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌తో కలిసి స్వీకరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, ఆదిలాబాద్‌ ఎమ్యెల్యే జోగు రామన్న, బోథ్‌ ఎమ్యెల్యే రాథోడ్‌ బాపూరావ్‌, డీసీసీబీ చైర్మన్‌ దామోదర్‌ రెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని, ట్రైనీ ఐఏఎస్‌ అభిలాష, జాయింట్‌ కలెక్టర్‌ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

పరేడ్‌మైదానంలో వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. టీఎస్‌ రెసిడెన్షియల్‌ బాలికల పాఠశాల, కేజీబీవీ ఆదిలాబాద్‌ విద్యార్థినులు, టీఎస్‌ఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ ఆదిలాబాద్‌ బాలికలు జానపదగేయాలపై ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు వందేమాతరంపై, ప్రభుత్వ ఆశ్రమ పాఠశల విద్యార్థినులు, ఎంజేపీ మావల విద్యార్థినులు, టీఎస్‌ మోడల్‌ స్కూల్‌ బజార్‌హత్నూర్‌ విద్యార్థులు వందేమాతరం గేయంపై  నృత్యాలు ప్రదర్శించారు. అనంతరం నృత్యాలు చేసిన పాఠశాలలకు కలెక్టర్‌, ఎస్పీ జ్ఞాపికలను అందించారు.

ఆకట్టుకున్న స్టాళ్లు..

జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలు చేపట్టిన సంక్షేమ పథకాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. డీపీఆర్వో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి ఛాయాచిత్రాలు, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నర్సరీల ఏర్పాటు, ఫించన్ల పంపిణీ, విద్యాశాఖ ఆధ్వర్యంలో కేజీబీవీల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన దళిత భస్తీ, రుణాల పంపిణీ, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కేసీఆర్‌ కిట్‌లు, పీహెచ్‌సీల్లో అందిస్తున్న వైద్యసేవలు, ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ సెంటర్ల నిర్వహణ, గర్భిణులకు సహాయం, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో రైతుబంధు చెక్కుల పంపిణీ, సబ్సిడీ విత్తనాలు, ఎరువుల పంపిణీలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని స్టాళ్లలో ఉంచారు.


logo