గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Jan 27, 2020 ,

ఊరూవాడా గణతంత్ర వేడుకలు

ఊరూవాడా గణతంత్ర వేడుకలు

బేల / జైనథ్‌ : బేల మండలంలోని మణియార్‌పూర్‌, శంషాబాద్‌, డోప్టాల, చప్రాల, సిర్సన్న, సాంగిడి, అవాల్‌పూర్‌ తదితర గ్రామాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్సై నజీర్‌, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ వట్టిపెల్లి ఇంద్రశేఖర్‌, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో భగత్‌ రమేశ్‌, మండల విద్యా వనరుల కేంద్రంలో ఎంఈవో కోల నర్సింహులు, ఐకేపీ కార్యాలయంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు పుష్ప, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో మహేందర్‌కుమార్‌, తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ బడాల రాంరెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ ఠాక్రే వనిత గంభీర్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్‌ ఠాక్రే, మండల అధ్యక్షుడు ప్రమోద్‌రెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు ఓల్లఫర్‌ దేవన్న, అడనేశ్వర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ సతీశ్‌ పవార్‌, ఐకేపీ ఏపీఎం కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విజ్ఞాన హైస్కూల్‌ లిటిల్‌బర్డ్స్‌, కృష్ణవేణి, ఆయా గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి.  జైనథ్‌ మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ మహేంద్రనాథ్‌, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో గజానన్‌, వ్యవసాయ కార్యాలయంలో ఏవో వివేక్‌, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం చంద్రశేఖర్‌, మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో కార్యదర్శి మధుకర్‌, గ్రంథాలయంలో ఎంపీపీ గోవర్ధన్‌, జడ్పీ హైస్కూల్‌లో హెచ్‌ఎం లస్మన్న, కసూర్బా గాంధీ పాఠశాలలో ప్రిన్సిపాల్‌ ఎస్‌కె ఆల్మూన్‌, మాడల్‌స్కూల్‌లో ప్రిన్సిపాల్‌ ఆశన్న, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై వెంకన్న, జీపీలో సర్పంచ్‌ దేవన్న మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్సెట్టి గోవర్ధన్‌, జడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకట్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ ముక్కెర ప్రభాకర్‌, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ లింగారెడ్డి, వైస్‌ ఎంపీపీ విజయ్‌కుమార్‌, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ సుదాంరెడ్డి పాల్గొన్నారు.logo