శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Adilabad - Jan 29, 2020 ,

దేశ సమైక్యతే ప్రధాన ధ్యేయం

దేశ సమైక్యతే ప్రధాన ధ్యేయం

తాంసి : జిల్లా కేంద్రంలోని రాజకీయ పార్టీల కార్యాలయాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు, పలు పాఠశాలల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు గణతంత్ర దిన్సోవాన్ని ఉద్దేశించి మాట్లాడారు. శాంతి సామరస్యాలతో అందరూ కలిసి మెలిసి ఉండాలని అన్నారు. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకు యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు అహర్నిశలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ సేవకు ముందుకు రావాలని తెలిపారు.

టీఎన్‌జీవో భవనంలో..

తెలంగాణ నాన్‌గజిటెడ్‌ ఉద్యోగుల సంఘ భవనంలో ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సంద అశోక్‌, నవీన్‌ కుమార్‌ మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు చంద అశోక్‌, తిరుమల్‌రెడ్డి మహేందర్‌, భాగ్యలక్ష్మి, గోవర్ధన్‌, సప్ధర్‌ అలీ, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఉపాధ్యాయ సంఘాలు..

జిల్లా కేంద్రంలోని ఎస్‌టీయూ భవనంలో ఆ సంఘం రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బెజ్జంకి రవీంద్ర జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర నాయకులు యాదగిరి, రాజు, సత్యనారాయణ, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. పీఆర్టీయూ భవనంలో ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణకుమార్‌, కుడాల రవీందర్‌, టీఎస్‌యూటీఎఫ్‌ కార్యాలయంలో ఆ సంఘం అధ్యక్షుడు వెంకట్‌, టీయూటీఎఫ్‌ కార్యాలయంలో వినోద్‌ రెడ్డి జాతీయ జెండా ఎగురవేసి ఉపన్యసించారు. 

రాజకీయ పార్టీలు...

ఆదిలాబాద్‌ పట్టణంలో వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే జోగురామన్న ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ ఆవిష్కరించారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి రాంచందర్‌రెడ్డి, గండ్రత్‌ సుజాత ఆవిష్కరించారు. ఎంఐఎం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఎండీ ఫారుక్‌హైమద్‌ ఆవిష్కరించారు. టీడీపీ, సీపీఐ, సీపీఎం కార్యాలయాల్లో ఆయా పార్టీల అధ్యక్షులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. బీసీ సంఘం, ఎస్సీ, ఎస్టీ, మున్నూరు కాపు, పద్మశాలీ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు నీలాదేవి, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం పద్మ, కేజీబీవీలు, గురుకులాల్లో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జెండా ఎగురువేశారు. అంతకు ముందు వివిధ పాఠశాలల విద్యార్థులు పట్టణంలోని కాలనీల్లో ప్రభాత భేరి నిర్వహించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. 


logo