మంగళవారం 31 మార్చి 2020
Adilabad - Jan 26, 2020 , 02:04:46

నాగోబా భక్తజనసంద్రం

నాగోబా భక్తజనసంద్రం
  • -మొదటి రోజు పోటెత్తిన భక్తులు
  • -112 మంది కొత్త కోడళ్లకు బేటింగ్‌

నాగోబా జాతరకు మొదటి రోజు భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు నాగోబా దర్శనానికి బారులు తీరారు. నాగోబాకు శుక్రవారం అర్ధరాత్రి మెస్రం వంశీయులు నిర్వహించిన మహాపూజల అనంతరం కొత్త కోడళ్లకు నాగోబా సన్నిధిలో బేటింగ్‌ (పరిచయ) కార్యక్రమాన్ని నిర్వహించారు. సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ రాత్రి గోవాడ్‌ నుంచి నాగోబా ఆలయానికి తీసుకొచ్చి ఆలయంలో ప్రవేశం కల్పించారు. 22 కితలు వంతుల వారీగా అవ్వాల్‌ దేవతకు కొత్త కోడళ్లు, మెస్రం వంశ మహిళలు నైవేద్యాలు సమర్పించారు. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.logo
>>>>>>