గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Jan 25, 2020 , 01:20:07

సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకంఇచ్చోడ : రెండో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ముక్రా (కే) గ్రామం జిల్లాలో మొదటి స్థానాన్ని సాధించిన సందర్భంగా గ్రామస్తులు పాలకవర్గ సభ్యులను శుక్రవారం ఘనంగా సత్కరించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ గాడ్గె సుభాశ్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ అమలు చేసిన పల్లె ప్రగతి  కార్యక్రమంతోనే గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని అన్నారు. పల్లె ప్రగతిలో తమ గ్రామం జిల్లాలో మొదటి స్థానంలో నిలవడం ఆనందంగా ఉందన్నారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడంలో గ్రామస్తుల సహకారం మరువలేనిదని అన్నారు. వారి భాగస్వామ్యంతోనే గ్రామం అభివృద్ధి దిశగా పయనిస్తున్నదని చెప్పారు. పల్లెల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గాడ్గె మీనాక్షి, ఉప సర్పంచ్‌ వర్ష, పంచాయతీ కార్యదర్శి కిరణ్‌, సంజీవ్‌, తిరుపతి, విఠల్‌, ప్రహ్లాద్‌ తదితరులు పాల్గొన్నారు.logo