శనివారం 28 మార్చి 2020
Adilabad - Jan 25, 2020 , 01:18:22

మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య

మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య
  • జిల్లా పరిశ్రమల శాఖ జీఎం జాదవ్‌ రాంకిషన్‌నాయక్‌నార్నూర్‌: మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటేనని, విద్యార్థి దశ నుంచి ఉన్నత లక్ష్యంతో కష్టపడాలని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌, మండల ప్రత్యేకాధికారి జాదవ్‌ రాంకిషన్‌నాయక్‌ అన్నారు. మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సెక్టోరల్‌ అధికారి శ్రీనివాస్‌రెడ్డితో కలసి ప్రజ్ఞ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలను, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.  అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి బాలికా చదువుకోవాలని, బాలికల విద్య కోసం ప్రభుత్వాలు కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రోత్సాహకాలను వివరిస్తూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆలోచనలతో రూపొందించిన ప్రయోగాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని అభినందించారు.  ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో ముందుడగు వేస్తూ దేశ భవిష్యత్తుకు ఉపయోగపడాలని పిలుపునిచ్చారు. విద్యార్థినులు వందశాతం ఉత్తీర్ణత సాధించడంపై ఉపాధ్యాయులను అభినందించారు.  ప్రత్యేకాధికారిణి జాదవ్‌ కవిత, సీఆర్పీ వినోద్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


logo