గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Jan 25, 2020 , 01:16:33

ముగిసిన ఖాందేవ్‌ జాతర

ముగిసిన ఖాందేవ్‌ జాతర


నార్నూర్‌: మండల కేంద్రంలో 15 రోజులుగా నిర్వహించిన ఖాందేవ్‌ జాతర ముగిసింది. చివరి రోజు శుక్రవారం తొడ సం వంశస్తులు పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన దుకాణాలను వ్యాపారులు తొలగించి తమ సామగ్రిని వాహనాల్లో తీసుకెళ్లారు. శనివారం నుంచి కెస్లాపూర్‌ నాగోబా జా తర ఉండడంతో అక్కడికి తరలించారు. జాతర సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో లెక్కించగా రూ. 35,020 ఆదా యం సమకూరింది. తైబజార్‌ వేలం ద్వారా రూ.44,001 మొత్తం రూ.79, 021 ఆదాయం సమకూరినట్లు ఆలయ కమిటీ సభ్యుడు తొడసం నాగోరావ్‌ తెలిపారు. కార్యక్రమంలో తొడసం గోపాల్‌, తొడసం గజానంద్‌ పాల్గొన్నారు.
logo