గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Jan 24, 2020 , 00:55:40

కౌంటింగ్‌ విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

కౌంటింగ్‌ విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
  • -కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌
  • -సిబ్బందితో సమీక్షా సమావేశం


ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : కౌంటింగ్‌ విధుల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి  కలెక్టర్‌  దివ్యదేవరాజన్‌ అన్నారు. గురువారం టీటీడీసీలో కౌంటింగ్‌ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  కలెక్టర్‌ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లను చేయాలని సూచించారు. 25న ఉదయం 6 గంటలకే కేంద్రానికి చేరుకోవాలన్నారు. సిబ్బందికి గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నట్లు తెలిపారు. కేటాయించిన ప్రాంతాల్లో విధులు నిర్వహించాలన్నారు. కౌంటింగ్‌ సమయంలో ఫోన్లకు అనుమతి ఉండదన్నారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించాలన్నారు. అనంతరం బాక్స్‌ల్లోని బ్యాలెట్‌ పత్రాలను కౌంటింగ్‌ ఏజెంట్ల సమక్షంలో సీల్‌ విప్పి కౌంటింగ్‌ నిర్వహించాలన్నారు. ఓట్ల లెక్కింపును 32 మంది పరిశీలకులు, 32 మంది సూపర్‌వైజర్లు, 64మంది సహాయకులు, ముగ్గురు హాల్‌ సూపర్‌వైజర్లు, 16 మంది లేబర్లను నియమించాలన్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని బోర్డుపై రాయడం, కంప్యూటరీకరణ చేయాలని అధికారులను ఆదేశించారు. పేపర్‌ సీల్‌ పరిశీలన, బ్యాలెట్‌ పేపర్‌ అకౌంట్లను సరిచూసుకోవాలని తెలిపారు.  సమావేశంలో సంయుక్త కలెక్టర్‌ సంధ్యారాణి, ట్రైనీ కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, జిల్లా రెవెన్యూ అధికారి నటరాజన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మారుతి ప్రసాద్‌, ఆర్డీవో సూర్యనారాయణ, అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ రాజు, ఇంజినీరింగ్‌ సిబ్బంది ఉన్నారు.logo