శనివారం 04 ఏప్రిల్ 2020
Adilabad - Jan 24, 2020 , 00:55:40

విద్యుత్‌ విజిలెన్స్‌ అధికారుల దాడులు

విద్యుత్‌ విజిలెన్స్‌ అధికారుల దాడులుబోథ్‌, నమస్తే తెలంగాణ : మండలంలోని పొచ్చెర గ్రామంలో గురువారం విద్యుత్‌ విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. వరంగల్‌ నుంచి వచ్చిన ఎనర్జీ ఆడిట్‌ బృందం సభ్యులు తనిఖీలు చేపట్టారు. గ్రామంలోని  293 సర్వీసులు పరిశీలించారు. వీటిలో 14 మంది మీటర్లు లేకుండా కోక్కెలు వేసుకుని విద్యుత్‌ వాడుతుండగా పట్టుకున్నారు. మరో 21 మంది పరిమితికి మించి విద్యుత్‌ వాడుతున్నట్లు గుర్తించారు. 19 మంది వినియోగదారులు మీటర్లు కలిగి ఉండి విద్యుత్‌ చౌర్యానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. మరొకరు మీటరు తిరగకుండా చేసి విద్యుత్‌ వాడుతున్నట్లు తెలుసుకున్నారు. వీరికి జరిమానాలు విధించారు. బృందం సభ్యులైన ఏఈలు  దుగ్యాల రంజిత్‌, ఎల్‌ యోగేశ్‌, సాల్‌మన్‌రాజు, వీ రవీందర్‌, సబ్‌ ఇంజినీర్‌ వెంకటేశ్‌, బోథ్‌ ఏఈ జనార్దన్‌రెడ్డి, సీనియర్‌ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ మంగులాల్‌, లైన్‌మెన్లు, జేఎల్‌ఎంలు పాల్గొన్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. విద్యుత్‌ను మీటర్ల ద్వారా వాడుకుని సకాలంలో బిల్లులు చెల్లించి సంస్థను అభ్యున్నతికి సహకరించాలని  వినియోగదారులకు సూచించారు.

logo