గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Jan 24, 2020 , 00:55:40

కౌంటింగ్‌ పకడ్బందీగా నిర్వహించాలి

కౌంటింగ్‌ పకడ్బందీగా నిర్వహించాలి
  • - కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌
  • -కౌంటింగ్‌ కేంద్రం పరిశీలన

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : కౌంటింగ్‌ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ అధికారులను ఆదేశించారు. గురువారం రాజకీయ నాయకుల సమక్షంలో కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. కౌంటింగ్‌ సమయంలో అధికారులు జాగ్రత్తలు పాటించాలన్నారు. వార్డుల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్‌ బాక్సుల సీల్‌ విప్పాలన్నారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భారీగా ప్రజలు తరలి రానున్న దృష్ట్యా బారికేడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. కౌంటిం గ్‌ కేంద్రంలోకి ఇతరులను అనుమతించకుండా చూడాలన్నారు. పాసులు ఉన్నవారికి మాత్రమే లోనికి అనుమతి ఇవ్వాలన్నారు. కేఆర్‌కే కాలనీకి వెళ్లే వాహనాలను దారిమళ్లించాలని తెలిపారు. పోలీసు శాఖ ముందస్తు చర్యలో భాగంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ మారుతి ప్రసాద్‌, ఆర్డీవో సూర్యనారాయణ, మున్సిపల్‌ ఆర్వో గంగాధర్‌, పలు శాఖల అధికారులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
logo
>>>>>>