ఆదివారం 29 మార్చి 2020
Adilabad - Jan 23, 2020 , 00:20:22

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగరేస్తాం

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగరేస్తాం


తాంసి(ఆదిలాబాద్‌): ఆదిలాబాద్‌ మున్సిపాలిటీపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగరేయడం ఖాయమని ఎమ్మెల్యే జోగు రామన్న ధీమా వ్యక్తం చేశారు. అన్నివర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఆదరించారని, సర్వేలు తమకే అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. భుక్తాపూర్‌ వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండారి సతీశ్‌ భారీ మెజార్టీతో గెలుస్తారని ఆ వార్డు యువకులు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం పట్టణంలో ఎమ్మెల్యే నివాసంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థితో కలిసి యువకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలువడం ఖాయమన్నారు. రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి తమ పార్టీ అభ్యర్థులకు పట్టణం ఓటర్లు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. ఈ విషయం సర్వేల ద్వారా తమకు తెలిసిందన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలు పట్టించుకోకుండా అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కట్టనున్నారని ఆనందం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థులను ఆదరించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేను సన్మానించిన వారిలో టీఆర్‌ఎస్‌ నాయకులు షాహిద్‌, మసూద్‌పటేల్‌, విజయ్‌, షఫీ, కార్తీక్‌, రవీందర్‌, రాహుల్‌ తదితరులు ఉన్నారు.


logo