బుధవారం 01 ఏప్రిల్ 2020
Adilabad - Jan 22, 2020 , 00:38:56

మున్సి ‘ పోలింగ్‌ ‘ నేడే!

 మున్సి ‘  పోలింగ్‌ ‘ నేడే!
  • -ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు...
  • -మున్సిపల్‌ పరిధిలో 49 వార్డులు
  • - 183 పోలింగ్‌ కేంద్రాలు
  • -1,27,922 మంది ఓటర్లు
  • - సామగ్రి పంపిణీ చేసిన అధికారులు
  • -పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది

మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్‌ నేడు నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మున్సిపల్‌ పరిధిలో 49 వార్డులు ఉండగా.. 1,27,922 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం అధికారులు 183 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,266 మంది పోలింగ్‌ సిబ్బంది విధుల్లో ఉంటారు. మంగళవారం ఉదయం టీడీడీసీలో అధికారులు ఎన్నికల సిబ్బందికి సామగ్రిని పంపిణీ చేశారు. కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌, ఎస్పీ విష్ణువారియర్‌ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు.    సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకునేందుకు మధ్యాహ్నం నుంచే పయనం కట్టడం ప్రారంభించారు. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభకానుండగా.. సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనున్నది. ఐదు గంటల లోపు పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్న ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వనున్నారు. పోలింగ్‌ అనంతరం అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తం కానున్నది.
- ఆదిలాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి

ఆదిలాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ ఎన్నికలకు నేడు పోలింగ్‌ జరుగనున్నది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మున్సిపల్‌ పరిధిలో 49 వార్డులు ఉండగా 1,27,922 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం అధికారులు 183 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం టీడీడీసీలో అధికారులు ఎన్నికల సిబ్బందికి సామగ్రిని పంపిణీ చేశారు. కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌, ఎస్పీ విష్ణువారియర్‌ పంపిణీ కేంద్రాన్ని సందర్శించి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలింగ్‌ సామగ్రిని తీసుకున్న సిబ్బంది మధ్యాహ్నం నుంచి తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. నేడు ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభకానుండగా సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది. ఐదు గంటల లోపు పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్న ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.

ఆదిలాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలకు నేడు పోలింగ్‌ జరుగనున్నది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభకానుండగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మున్సిపల్‌ పరిధిలో గతంలో 36 వార్డులు ఉండగా పునర్విభనజలో భాగంగా పట్టణ శివారు ప్రాంతాలను కలుపుకొని 49 వార్డులను ఏర్పాటు చేశారు. 49 వార్డుల్లో 1,27,922 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 63,111 మంది మహిళలు 64,805 మంది, ఇతరులు ఆరుగురు, సర్వీస్‌ ఓటర్లు 88 మంది ఉన్నారు. ప్రజలకు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు 183 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా వార్డుల్లో ఉండే ఓటర్లకు సమీపంలోని ప్రైవేటు, ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలు, ఇతర ప్రభుత్వ భవనాల్లో పోలింగ్‌ కేంద్రాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. పోలింగ్‌లో భాగంగా బ్యాలెట్‌ పేపర్లను వినియోగిస్తారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల గుర్తులతో పాటు ఇండిపెండెంట్‌లకు కేటాయించిన గుర్తులు బ్యాలెట్‌ పేపర్లలో ఉంటాయి. 49 వార్డులకు టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, ఎంఐఎం  పార్టీలతో కలిపి ఇండిపెండెంట్‌లు 286 మంది పోటీలో ఉన్నారు. పలు వార్డుల్లో 4 నుంచి 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పలు వార్డుల  నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు వారం రోజులపాటు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. నేడు జరిగే పోలింగ్‌లో అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తం కానుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నది. 5 గంటల లోపు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.

పోలింగ్‌ సామగ్రి పంపిణీ..

నేడు జరిగే పోలింగ్‌ను పురస్కరించుకుని మంగళవారం పాలిటెక్నిక్‌ సమీపంలో ఉన్న టీటీడీసీలో పోలింగ్‌ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోలింగ్‌ విధులు నిర్వహించి అధికారులు, సిబ్బంది వివరాలను గోడపై అతికించారు. తమకు కేటాయించిన వార్డులకు సంబంధించిన పోలింగ్‌ సామగ్రిని సిబ్బంది తీసుకున్నారు. బ్యాలెట్‌ పేపర్లు, గుర్తులు, ఇతర సామగ్రిని పరిశీలించుకుని మధ్యాహ్నం అనంతరం వాహనాల్లో పోలీసు బందోబస్తు మధ్య తమ పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో సైతం సిబ్బంది ఇబ్బందులు పడకుండా అధికారులు వారికి అవసరమైన ఏర్పాట్లు చేశారు.

73 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌..

పోలింగ్‌ నిర్వహణలో భాగంగా 183 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా వీటిలో 23 ప్రాంతాల్లోని 73 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించిన అధికారులు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలను జరుగకుండా వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతోపాటు జిల్లా అధికారులు వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళిని పరిశీలిస్తారు. వీటితో పాటు 110 పోలింగ్‌ కేంద్రాల్లో సైతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలింగ్‌ను రికార్డు చేయనున్నారు. ఇందుకోసం పోలింగ్‌ బాసర త్రిపుల్‌ ఐటీ విద్యార్థులతోపాటు మీసేవ, ధరణి ఆపరేటర్ల సేవలను వినియోగించుకోనున్నారు.

1266 మంది పోలింగ్‌ సిబ్బంది..

ప్రిసైడింగ్‌ అధికారులు 230 మంది, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు 230 మంది, ఇతర పోలింగ్‌ సిబ్బంది 715 మంది, మైక్రో అబ్జర్వర్లు 77 మంది, జోనల్‌ అధికారులు 14 మంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. పోలింగ్‌ కేంద్రాలతో ఎలాంటి అవాంఛనీయ ఘటలను జరుగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరిగే 23 ప్రాంతాల్లోని 73 సమస్యాత్మక కేంద్రాలు, 40 ప్రాంతాల్లోని 110 సాధారణ కేంద్రాలను గుర్తించారు. పోలీసు పెట్రోలింగ్‌ పార్టీలు పోలింగ్‌ కేంద్రాల్లో తిరుగుతూ పరిస్థితిని ఎప్పుడికప్పుడు అంచనా వేస్తారు. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్స్‌లను టీటీడీసీకి తరలించనున్నారు. ఇందుకోసం స్ట్రాంగ్‌ రూంలను ఏర్పాటు చేశారు.

బోగస్‌ ఓటు వేస్తే కఠిన చర్యలు

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: పట్టణంలో బుధవారం జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో బోగస్‌ ఓటువేస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ హెచ్చరించారు. ఈ విషయమై ఆమె మంగళవారం ఒక ప్రకటన విడదుల చేశారు. ఓటుహక్కను వినియోగించుకునేవారు పట్టణంలో నివాసం ఉన్నట్లు అడ్రస్‌ ప్రూఫ్‌తోపాటు ఫొటోతో కూడిన గుర్తింపు కార్డుతో పోల్‌ చీటీని వెంట తీసుకెళ్లాలన్నారు. ఎన్నికల సంఘం సూచించిన మేరకు ఓటుహక్కను వినియోగించుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

అప్రమత్తంగా విధులు నిర్వహించాలి

-  ఆదిలాబాద్‌ కలెక్టర్‌ దివ్య
పోలింగ్‌ సిబ్బంది విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ దివ్య సూచించారు. టీటీడీసీలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఎస్పీ విష్ణువారియర్‌తో కలిసి పరిశీలించారు. సిబ్బంది పోలింగ్‌ సామగ్రితోపాటు కేంద్రాల్లో ఉండాలని ఉదయం 6 గంటలకు పోలింగ్‌ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఓటర్లకు సంబంధించిన గుర్తింపు కార్డులను పరిశీలించాన్నారు. గడువులోగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన ఓటర్లకు అవకాశం కల్పంచాలని, బ్యాలెట్‌ పేపర్లకు సంబంధించిన వివరాలను స్పష్టంగా రాయాలని సూచించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో సీసీ కెమరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్పీ విష్ణువారియర్‌ మాట్లాడుతూ.. పోలింగ్‌ కేంద్రాల్లో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కేంద్రాల్లో ఎవరైనా సమస్యలు సృష్టిస్తే పోలీసు ఆదిలాబాద్‌ డీఎస్పీకి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.


logo
>>>>>>