గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Jan 22, 2020 , 00:32:03

మర్రిచెట్ల నీడలో..

మర్రిచెట్ల నీడలో..
  • -నాలుగు రోజుల బసలో మెస్రం వంశీయులు
  • -ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి కెస్లాపూర్‌కు తరలివచ్చిన మెస్రం వంశీయులుమెస్రం వంశీయులు కుటుంబ సమేతంగా మర్రిచెట్ల కాడ నాలుగు రోజుల బస చేయడం.. నాగోబా జాతరలో మరో ఆకర్షణీయమైన సందర్భం!  ప్రస్తుతం మర్రిచెట్ల వద్ద  మెస్రం వంశస్తుల సందడి కనిపిస్తున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న మెస్రం వంశీయులు కుటుంబ సమేతంగా ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపు మెస్రం వంశ పటేళ్లు సైతం మంగళవారం రాత్రి మర్రిచెట్ల వద్దకు చేరుకోవడంతో బుధవారం నుంచి జాతర జరిగే 24వ తేదీ వరకు ప్రత్యేక పూజలు కొనసాగనున్నాయి.
- ఇంద్రవెల్లి

ఇంద్రవెల్లి : నదీ జలంతో కెస్లాపూర్‌ మర్రిచెట్ల వద్దకు సోమవారం రాత్రి చేరుకున్న మెస్రం వంశీయులు ఆలయ పరిసర ప్రాంతంలోని మర్రిచెట్ల వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. మంగళవారం సంప్రదాయ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్యాలు సమర్పించారు. మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్‌పటేల్‌తో పాటు ఆయా గ్రామాల నుంచి కెస్లాపూర్‌కు వచ్చిన మెస్రం వంశీయుల పటేళ్లను పర్ధాంజీలు గణపతి, దాదారావ్‌, తుకుడోజీ, కోత్వాల్‌ తిరుపతి మర్రిచెట్ల వద్దకు రావాలని ఆహ్వానించారు. అనంతరం సమావేశం నిర్వహించారు. 24న నాగోబాకు నిర్వహించే మహాపూజలతోపాటు సిరికొండ మండలంలో తయారు చేసి ఉంచిన మట్టికుండలను తీసుకురావడంతోపాటు పెద్దల పేరిట నిర్వహించే తుమ్‌ కార్యక్రమం నిర్వహణపై చర్చించారు.  కార్యక్రమంలో మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్‌పటేల్‌, చిన్నుపటేల్‌, బాదీరావ్‌పటేల్‌, లింబారావ్‌పటేల్‌, మెస్రం వంశీయులు కోశారావ్‌ కటోడ, కటోడ హనుమంత్‌రావ్‌, పర్ధాంజీలు తుకుడోజీ, గణపతి, దాదారావ్‌, నాయికిలు ధర్ము, ఇస్రు తదితరులు పాల్గొన్నారు.

ఇంద్రాదేవికి ప్రత్యేక పూజలు

కెస్లాపూర్‌ నాగోబా జాతరను పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలకు చెందిన మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో ఇంద్రాదేవికి సంప్రదాయ పూజలు నిర్వహించారు. మంగళవారం కెస్లాపూర్‌కు తరలివస్తున్న మెస్రం వంశీయులు  ఇంద్రాదేవి ఆలయ ఆవరణలోనే నైవేద్యం తయారు అనంతరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. సాయంత్రం ఇంద్రాదేవి ఆలయం నుంచి కెస్లాపూర్‌ మర్రిచెట్ల వద్దకు బయలుదేరి వెళ్లారు. మెస్రం వంశీయులు ఉన్నారు.logo