ఆదివారం 29 మార్చి 2020
Adilabad - Jan 21, 2020 , 00:31:29

ప్రచారానికి తెర

ప్రచారానికి తెర
  • -చివరి రోజు హోరెత్తిన ప్రచారం
  • -వార్డుల్లో అభ్యర్థుల సందడి
  • -టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నజడ్పీ, డీడీసీ చైర్మన్‌లు, ఆదిలాబాద్‌, బోథ్‌ ఎమ్మెల్యేలుపుర పోరులో ప్రచార పర్వానికి పడింది. ఆరు రోజులపాటు విస్తృతంగా సాగిన ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. నాయకులు, అభ్యర్థులు చివరి రోజు ప్రచారాన్ని హోరెత్తించారు. రోడ్‌షోలు, మైకుల హోరు రోజంతా సాగాయి.  చివరి రోజు టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, టీడీడీసీ చైర్మన్‌ లోక భూమారెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ గొడాం నగేశ్‌ పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డుల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేశారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఆరు రోజులపాటు సాగిన ప్రచారంలో అభ్యర్థులు గతంలో తాము చేసిన అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగారు. ఇప్పుడు గెలిస్తే ఆయా వార్డుల్లోని సమస్యలు పరిష్కరిస్తామంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రేపు నిర్వహించే పోలింగ్‌లో అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది.
- ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి: మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఆరు రోజులపాటు విస్తృతంగా సాగిన ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. చివరి రోజు నాయకులు, అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తించారు. రోడ్‌షోలు, మైకులు, ఇంటింటా తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చివరి రోజు టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, టీడీడీసీ చైర్మన్‌ లోక భూమారెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. మున్సిపల్‌ పరిధిలోని 49 వార్డుల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేశారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఆరు రోజులపాటు సాగిన ప్రచారంలో అభ్యర్థులు తమ చేసిన అభివృద్ధితోపాటు గెలిస్తే ఆయా వార్డుల్లో సమస్యలు పరిష్కరిస్తామంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం నిర్వంహిచారు. రేపు జరిగే పోలింగ్‌లో అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది.

మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా రేపు పోలింగ్‌ జరుగనుండగా సోమవారం సాయంత్రం ప్రచారం ముగిసింది. గతంలో ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో  36 వార్డులు ఉండగా పునర్విభజనలో భాగంగా వార్డుల సంఖ్య 49కి పెరిగింది. ఈ నెల 14న నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు ఇండిపెండెంట్‌లు కలిపి 286 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అన్ని వార్డుల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌, ఎంఐఎంతోపాటు ఇండిపెండెంట్‌లు పలు వార్డుల్లో పోటీలో ఉన్నారు. ఈ నెల 15 నుంచి అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. మొదటి రోజు నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టగా ఆయా వార్డుల్లో పోటీలో ఉన్న ఇండిపెండెంట్‌లు సైతం తమకు ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. ఆరు రోజులపాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు మున్సిపల్‌ పరిధిలో 49 వార్డుల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి వార్డు పరిధిలోని వాడల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఆటోల్లో మైకులు ఏర్పాటు చేసుకుని పాటల ద్వారా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మైకులతోపాటు వాల్‌పోస్టర్‌లు, పార్టీలతో పాటు తమకు కేటాయించిన గుర్తులను, పేర్లను తెలయజేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.

చివరిరోజు హోరెత్తిన ప్రచారం..

ప్రచారం చివరి రోజు ప్రధాన పార్టీల ప్రచారాన్ని హోరెత్తించాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ లోక భూమారెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే జోగు రామన్న కొత్తగా ఏర్పడిన అనుకుంట, బంగారిగూడతోపాటు పట్టణంలోని పలు వార్డుల్లో రోడ్‌షో నిర్వహించారు. జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌ కేఆర్‌కే కాలనీ, న్యూ హౌసింగ్‌బోర్డు ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేశారు. డీడీసీ చైర్మన్‌ లోక్‌ భూమారెడ్డి రాంనగర్‌లో గడపగడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను వివరిం


చారు. మున్సిపల్‌ పరిధిలోని 49 వార్డుల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు తమ అనుచరులతో ప్రచారం చేపట్టారు. ఆరు రోజులు పాటు మున్సిపాలిటీ పరిధిలో మార్మోగిన ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. logo