సోమవారం 06 ఏప్రిల్ 2020
Adilabad - Jan 21, 2020 , 00:30:40

రైతులకు శుభవార్త..!

రైతులకు శుభవార్త..!
  • -రబీకి రైతుబంధుకు నిధులు మంజూరు
  • -వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ
  • -జిల్లాలో 1,37 వేల మందిరైతులకు లబ్ధి

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. యాసంగి పంటకు సంబంధించి రైతుబంధు పథకం నిధులను మంజూరు చేస్తూ సోమవారం వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో జిల్లాలోని 1,37,795 మంది రైతులకు లబ్ధి చేకూరనున్నది. త్వరలో రూ.268 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ యాసంగి లో 32 వేల హెక్టార్లలో పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయ శాఖ ఆంచనా వేయగా.. ఇప్పటి వరకు 35 వేల హెక్టార్లలో రైతులు వివిధ పంటలు వేసినట్లు అధికారులు పేర్కొన్నారు. సాగుకు సరైన సమయంలో యాసంగి రైతుబంధు నిధులు త్వరలో అందనుండగా.. సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉన్నది.
- ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. యాసంగి పంటకు సంబంధించి రైతుబంధు పథకం నిధులను మంజూరు చేస్తూ సోమవారం వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో జిల్లాలోని 1,37,795 మంది రైతులకు లబ్ధి చేకూరనున్నది. త్వరలో రూ.268 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. 2019-20 వార్షిక బడ్జెట్‌లో రైతుబంధు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12,862 కోట్లు కేటాయించగా.. వానాకాలం సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా రూ.6,862 కోట్లు మంజూరు చేసి రైతుల ఖాతాల్లో జమచేశారు.  తాజాగా యాసంగి సీజన్‌లో అందించేందుకు రూ.5,100 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా వ్యవసాయ పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిధుల మంజూరుకు సంబంధించిన పరిపాలన అనుమతులు రావడంతో వ్యవసాయ శాఖ రైతుల వివరాలను ఆర్థిక శాఖకు అందించనున్నది. ఆ వివరాలు అందించిన వెంటనే ఆర్థిక శాఖ నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నది. యాసంగి సాగు ప్రారంభంలోనే రైతుబంధు పెట్టుబడి సాయం త్వరలో అందనుండడంతో జిల్లాలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది యాసంగి సాగు 32 వేల హెక్టర్లలో సాగవుతున్నట్లు వ్యవసాయ శాఖ ఆంచనా వేయగా ఇప్పటి వరకు 35 వేల హెక్టర్లలో వివిధ పంటలు సాగు అయినట్లు అధికారులు పేర్కొన్నారు. సాగుకు సరైన సమయంలో యాసంగి రైతుబంధు నిధులు త్వరలో అందనుండగా.. సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉన్నది. logo