గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Jan 21, 2020 , 00:28:31

అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి

అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి
నిజామాబాద్‌ జడ్పీ చైర్మన్‌ దాదాన్నగారి విఠల్‌రావు

భైంసా, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని ప్రభుత్వంలో ఐదేండ్ల కాలంలో చేసిన అభివృద్ధిని చూసి మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి,  నిజామాబాద్‌ జడ్పీచైర్మన్‌ దాదాన్నగారి విఠల్‌రావు కోరారు. సోమవారం భైంసా పట్టణంలోని పలు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపిస్తే, పట్టణంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను తెలుపుతూ మ్యానిఫెస్టోను సైతం విడుదల చేశామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలకు ఓటు వేస్తే.. అభివృద్ధిని అడ్డుకున్నవారవుతారని పేర్కొన్నారు. పేదలను ఉన్నతస్థాయికి తీసుకుపోవడమే లక్ష్యంగా ప్రతి గడపకూ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని అన్నారు. గత పాలకుల హయాంలో నెలకొన్న ఇబ్బందులను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తరువాత అన్ని కాలనీల్లో తాగునీటి వసతితో పాటు అభివృద్ధి పనులు కళ్లముందు కనిపిస్తున్నాయని అన్నారు. ప్రచారంలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు హల్ద రాజలింగు, తోట రాము, ఎజాజ్‌ హైమద్‌, ఫారూఖ్‌, విలాస్‌ గాదేవార్‌, భోజరాం, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులున్నారు.

అన్నివర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం

ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌

ఖానాపూర్‌: అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు.సోమవారం ఆమె పట్టణంలోని పద్మావతినగర్‌, శ్రీరాంనగర్‌ కాలనీల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున ముమ్మర ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఖానాపూర్‌ పట్టణ అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అంతరం శివాజీనగర్‌ రెండో వార్డులో ప్రచా రం చేశారు. ప్రచారంలో అభ్యర్థులు పరిమిలతా సురేశ్‌, సల్ల సువర్ణ చంద్రహాస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు సక్కారాం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

పోల్‌ స్లిప్‌ల పంపిణీ

ఖానాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని వార్డులో సోమవారం పోల్‌ స్లిప్‌ల పంపిణీచేశారు.విద్యానగర్‌లోని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఆమె ఓటుకు సంబంధించిన పోల్‌ స్లిప్‌ను బీఎల్‌వోలు అందజేశారు. ఈ నెల 22న జరిగే ఎన్నికలకు సంబంధించి ఇక్కడ మొత్తం 24 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వాటి పరిధిలో ఉన్న పోల్‌ స్లిప్‌లను ఓటర్లకు పంపిణీ చేస్తున్నట్లు కమిషనర్‌ బాలే మల్లేశం తెలిపారు. logo