గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Jan 20, 2020 , 01:31:14

నేటితో ముగియనున్న ప్రచారం

నేటితో ముగియనున్న ప్రచారం
  • -ఆరు రోజుల పాటు విస్తృతంగా ప్రచారం
  • -49 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు, అభ్యర్థుల పర్యటనలు
  • -ఇంటింటా ప్రచారంతో ఓటు అభ్యర్థన

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఈ నెల 22న జరిగే మున్సిపల్‌ ఎన్నికలకు సోమవారంతో ప్రచారం ముగియనున్నది. నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ అనంతరం ఆరు రోజులపాటు నాయకులు, అభ్యర్థులు మున్సిపల్‌ పరిధిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు పక్కా ప్రణాళికలతో ప్రచారం చేపట్టారు. జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపురావు, మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి లోక భూమారెడ్డి అభ్యర్థులతో కలిసి వార్డుల్లో ప్రచారం చేశారు. ప్రభుత్వం పథకాలను వివరించడంతో పాటు, పట్టణాభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనులను వివరించి ఓటును అభ్యర్థించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, అభ్యర్థుల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రధాన అంశమైన ప్రచారం నేటితో ముగియనున్నది.

ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో 49 వార్డుల ఉండగా ఈ నెల 14న నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్‌లు కలిపి 286 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 15 నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని ప్రారంభించారు. మైకులు, వాల్‌ పోస్టర్‌లు, స్టిక్కర్లతో వార్డుల్లో ఇంటింటా తిరుగుతూ ప్రచారాన్ని చేపట్టారు. ఆరు రోజుల పాటు వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ అనుచరులు, నాయకులతో కలిసి వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, ఎంఐఎంతో పాటు ఇండిపెండెంట్‌లు తమను గెలిపించాలంటూ ఓటర్లను కోరారు. గతంలో మున్సిపల్‌ పరిధిలో 36 వార్డులు ఉండగా పునర్విభజనలో భాగంగా వార్డుల సంఖ్య 49కి పెరిగింది. ఆదిలాబాద్‌, మావల మండలాల్లో పలు గ్రామాలు మున్సిపల్‌ పరిధిలోకి వచ్చారు. దీంతో ఈ సారి గతంలో కంటే పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య సైతం పెరిగింది. మున్సిపల్‌లో వీలినమైన వార్డులతో పాటు పాత వార్డుల్లో నాయకులు, కార్యకర్తలు అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. గతంలో గ్రామపంచాయతీలో ఉన్న గ్రామాల మున్సిపల్‌ పరిధిలో కలువడంతో ఆయా వార్డుల్లో సైతం మున్సిపల్‌ ఎన్నికల సందడి నెలకొన్నది. గతంలో పంచాయతీలో పోటీ చేసిన నాయకులు ఈ సారి మున్సిపల్‌ ఎన్నికల బరిలో నిలిచి తమను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.
logo
>>>>>>