గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Jan 20, 2020 , 01:28:31

పల్స్‌ పోలియో@94.21%

పల్స్‌ పోలియో@94.21%డీఎంహెచ్‌వో చందు


ఎదులాపురం: జిల్లావ్యాప్తంగా తొలిరోజు పల్స్‌ పోలియో 94.21 శాతం నమోదయిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తొడసం చందు తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని శాంతినగర్‌ ఆరోగ్యకేంద్రంలో పలువురు చిన్నారులకు పోలియో నివారణ మందు పంపిణీ చేసి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా  డీఎంహెచ్‌వో తొడసం చందు మాట్లాడుతూ.. సమష్టి కృషితోనే పోలియో వ్యాధి నియంత్రణ సాధ్యమని, చిన్నారుల నిండు జీవితానికి రెండు చుక్కల పోలియో నివారణ మందు వేయించాలని సూచించారు. ఏ ఒక్కరూ  పోలియో వ్యాధికి గురికాకుండా ఉండాలంటే అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో నివారణ మందు వేయించాలన్నారు. చిన్నప్పుడే పోలియో చుక్కలు వేసుకుంటే జీవితాంతం పోలియో బారిన పడకుండా చిన్నారులను కాపాడుకోవచ్చని సూచించారు.  అంగన్‌వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు, ఇతర మెడికల్‌ అధికారులు సమన్వయంతో పల్స్‌పోలియోను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా 730 పోలియో కేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు.  కార్యక్రమంలో  డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన,  జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి శ్రీకాంత్‌, శాంతినగర్‌ యూపీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ కిరణ్‌కుమార్‌, ఎన్‌హెచ్‌ఎం ప్రోగ్రాం అధికారి స్వామి, మాస్‌ మీడియా అధికారి పి.వెంకట్‌రెడ్డి, సిబ్బంది రాజారెడ్డి, ఏఎన్‌ఎంలు, ఆశకార్యకర్తలు తదితరులు ఉన్నారు.

అంకోలిని సందర్శించిన డీఎంహెచ్‌వో...

ఆదిలాబాద్‌ రూరల్‌: ప్రతి చిన్నారికీ తప్పని సరి పల్స్‌ పోలియో చుక్కలు వేయాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి తొడసం చందు అన్నారు. ఆదివారం అంకోలి పీహెచ్‌సీలో ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. ఆదివారం పోలియో చుక్కలు వేయని చిన్నారులకు ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్‌లు ఇంటింటికీ తిరిగి చుక్కలు వేయాలని సూచించారు. డీఎంహెచ్‌వో వెంట జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి శ్రీకాంత్‌, జిల్లా ఉప వైద్యాధికారి సాధన, ఎన్‌హెచ్‌ఎం అధికారి స్వామి, పీహెచ్‌సీ వైద్యులు రోజారాణి, ఫార్మాసిస్ట్‌ ఆలం, సుభాష్‌, జయశ్రీ, రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>