గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Jan 20, 2020 , 01:27:20

పూసాయి ఎల్లమ్మ సన్నిధిలో భక్తుల సందడి

పూసాయి ఎల్లమ్మ సన్నిధిలో భక్తుల సందడి


జైనథ్‌: మండలంలోని పూసాయి ఎల్లమ్మ జాతర ముగిసింది. ఆదివారం చివరి రోజు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దేవికి మొక్కులు చెల్లించి దర్శించుకున్నారు. ఉదయం నుంచి ఎడ్లబండ్లపై తరలివచ్చి తాత్కాలిక గూడారాలను ఏర్పాటు చేసుకొని కుటుంబ సమేతంగా గారెలు, అప్పాలు తదితర పిండి వంటలు చేసి దేవికి నైవేద్యంగా సమర్పించారు. జీవాలను, యాటలను బలి ఇచ్చారు. కోనేరులో పుణ్యస్నానాలను ఆచరించి ఆ జలాలను వెంట తీసుకువెళ్లారు. పంటపొలాల్లో చల్లుకుంటే అధిక పంటలు పండుతాయని భక్తుల నమ్మకం. చివరి ఆదివారం కావడంతో జిల్లా నలుమూలలతో మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దన తరలివచ్చారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. 


logo
>>>>>>