శనివారం 04 ఏప్రిల్ 2020
Adilabad - Jan 18, 2020 , 23:54:40

నేడు పల్స్‌పోలియో

నేడు పల్స్‌పోలియో
  • -ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
  • -జిల్లాలో 0-5 ఏండ్లలోపు చిన్నారులు : 73,475
  • -విభజించిన రూట్లు : 73
  • -ఏర్పాటు చేసిన కేంద్రాలు : 730
  • -పాల్గొనే సిబ్బంది : 2,920
  • -సమయం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు..

ఎదులాపురం : జాతీయ పల్స్‌ పోలియో కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశామని జిల్లా వైద్యాధికారి తొడసం చందు తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో పల్స్‌పోలియో కార్యక్రమానికి సంబంధించి వాల్‌ పోస్టర్లను విడుదల చేసి వివరాలను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 0-5 ఏండ్లలోపు పిల్లలు 73,475 మంది ఉన్నట్లు గుర్తించారు. ఈ ఏడాది రెండు దఫాలుగా పోలియో చుక్కలు వేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మొదటి విడతలో ఈ నెల 19న పోలియో చుక్కలు వేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 730 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 73 రూట్లుగా విభజంచారు. బుత్‌కు నలుగురు చొప్పున సిబ్బందిని చుక్కలు వేయడానికి నియమించారు. వీటికి అదనంగా 23 మొబైల్‌ టీంలను నియమించారు. ఇవే కాకుండా పలు ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌, ప్రధాన కూడళ్లలో జన సాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసి చుక్కలు వేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు.

ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరంగా చుక్కలు వేయనున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, ఏరియా దవాఖాన, జిల్లా దవాఖానలోనూ పోలియో చుక్కలను వేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలను గుర్తించి మరుసటి రెండు రోజులు సోమ, మంగళవారాల్లో ఇండ్ల వద్దే చుక్కల మందులను వేస్తారు. దీని కోసం జిల్లా వ్యాప్తంగా 730 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇటుక బట్టి, కాలువ పనులు జరుగుతున్న చోట ఇతర సంచార జాతుల పిల్లలకు చుక్కల మందు వేసేందుకు 23 మొబైల్‌ టీంలతో పాటు బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌లలో 23 ట్రాన్సిస్ట్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. చుక్కల మందులు వేసేందుకు ప్రతి కేంద్రంలో నలుగురు చొప్పున మొత్తం 2920 మంది సిబ్బందిని నియమించారు. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు రాష్ట్ర రాజధాని నుంచి డాక్టర్‌ రాజీవ్‌రాజ్‌ నియమించారు. 73,475 మంది పిల్లలకు 1.50 లక్షల డోస్‌లు అందుబాటులో ఉంచారు. పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 8 గంటలకు జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌ పీహెచ్‌సీలో ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, జిల్లా వ్యాధి నిరోదక టీకాల అధికారి శ్రీకాంత్‌, ఎన్‌హెచ్‌ఎం కార్యక్రమ అధికారి స్వామి, మెడికల్‌ అధికారి అశోక్‌, మాస్‌ మీడియా అధికారి పి.వెంకట్‌రెడ్డి ఉన్నారు.

విస్తృత ప్రచారం

పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చే సేందుకు అధికారులు వారం రోజుల ముందే వి స్తృత ప్రచారాన్ని చేపట్టారు. రూట్‌ అధికారులు, పోలియో కేంద్రాల సిబ్బందితో సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేశారు.logo