సోమవారం 30 మార్చి 2020
Adilabad - Jan 18, 2020 , 01:06:22

చేరికల జోష్‌

 చేరికల జోష్‌
  • -టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు
  • -ప్రజలకు వరంగా సంక్షేమ పథకాలు
  • -పలు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు సుగమం
  • -టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు
  • -టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు


ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతిపక్షాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు అన్ని వర్గాల ప్రజలకు వరంగా మారాయి. జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు గులాబీ పార్టీకి అండగా నిలుస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల సమయంలో ఎక్కువ సంఖ్యలో చేరికలు జరుగుతుండడంతో ఆయా వార్డుల్లో పార్టీ మరింత బలపడనుంది. దీంతో పలు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు సుగుమం కానుంది. ఇటీవల ఎమ్మెల్యే జోగు రామన్న సమక్షంలో పలువురు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నాయి. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, కేసీఆర్‌ కిట్‌, అమ్మఒడి, రూ.1 కిలో బియ్యం, రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటు లాంటి వాటితో పాటు ఇతర పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఫలితంగా జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీని ఆదరిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలు ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.

దీంతో ప్రతిపక్షాలు నాయకులకు ఎన్నికలంటేనే భయపడాల్సి వస్తున్నది. మున్సిపల్‌ ఎన్నికల్లో సైతం బల్దియాపై మరోసారి గులాబీ జెండా ఎగురనున్నది. మున్సిపల్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ నాయకులు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికను పక్కాగా నిర్వహించారు. గెలిచే అభ్యర్థులను పోటీలో నిలిపారు. దీంతో పాటు ప్రచారంలో సైతం పకడ్బందీ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. వార్డుల్లో నాయకులు, కార్యకర్తలు గడప, గడపకూ తిరుగుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో మెజార్టీ వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలిచే అవకాశాలున్నాయి.
పట్టణంలోని పలు వారుల్లో ప్రతిపక్షాలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వారు గులాబీ పార్టీలోకి వస్తున్నారు. ఇటీవల పట్టణంలోని పలు వార్డులకు చెందిన బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు ఎమ్మెల్యే జోగు రామన్న సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో పలు వార్డుల్లో పార్టీ మరింత బలపడనున్నది.  పట్టణంలోని ప్రతిపక్షాల నాయకుల వ్యవహార తీరుపై ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాయకులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు. పలు వార్డుల్లో ప్రతిపక్షాల అభ్యర్థుల ప్రచారానికి నాయకులు, కార్యకర్తలు దూరంగా ఉంటున్నారు. ఫలితంగా ఆ పార్టీలకు చెందిన అభ్యర్థుల గెలుపుపై ప్రభావం పడనున్నది.



logo