శనివారం 04 ఏప్రిల్ 2020
Adilabad - Jan 17, 2020 , 00:16:15

నాగోబా జాతరకు ముమ్మర ఏర్పాట్లు

నాగోబా జాతరకు ముమ్మర ఏర్పాట్లు
  • దర్బార్‌హాల్‌లో సీసీ నిర్మాణ పనులు ప్రారంభం
  • బస్టాండ్‌ స్థలంలో మొక్కల తొలగింపు

ఇంద్రవెల్లి: మండలంలోని కెస్లాపూర్‌ నాగోబా జారతను పురస్కరించుకొని ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.  కెస్లాపూర్‌ నాగోబా దర్బార్‌హాల్‌లో గురువారం ఐటీడీఏ అధికారులు సీసీ నిర్మాణ పనులను ప్రారంభించారు. నిర్మాణాల పనులను ఐటీడీఏ డీఈ తానాజీ దగ్గరుండి సీసీ నిర్మాణ పనులు చేయిస్తున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆధ్వర్యంలో మరుగుదొడ్లతోపాటు స్నానపుగదుల ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నాగోబా ఆలయ ఆవరణలో తాగునీటి పైపులైన్‌ మరమ్మతుతోపాటు నల్లాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్‌ ఏర్పాటు చేసే భూమిలో పత్తి కర్రలను తొలగిస్తున్నారు. రంగుల రాట్నలు ఏర్పాటు చేసే భూమిలో సైతం పత్తి కర్రలను తొలగించి భూమిను చదును చేస్తున్నారు. ఆయా శాఖలకు చెందిన అధికారులు, మెస్రం వంశీయులు అందుబాటులో ఉంటూ పనులను పర్యవేక్షిస్తున్నారు.logo