శనివారం 28 మార్చి 2020
Adilabad - Jan 14, 2020 , 00:27:53

ప్రజాశీర్వాదంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయం

ప్రజాశీర్వాదంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయం


నిర్మల్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: ప్రజల ఆశీర్వాదంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని మంత్రి  అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి  అన్నారు. సోమవారం పట్టణంలోని బంగల్‌పేట్‌ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అంతకు ముందు మంత్రి తన నివాసం వద్ద ప్రచార రథానికి మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి గండ్రత్‌ ఈశ్వర్‌తో కలిసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి  చెందిందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దక్కిందన్నారు. రానున్న రోజుల్లో పట్టణాన్ని అన్ని రంగాల్లో  అభివృది పరుస్తామని అన్నారు. నిర్మల్‌ జిల్లా ఆవిర్భావం అనంతరం ఇతర జిల్లాల కంటే వేగంగా అభివృద్ధి చెందిందని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికలో  42 వార్డులలో పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఓట్లు  వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గండ్రత్‌ ఈశ్వర్‌, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ రాంకిషన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ధర్మాజి రాజేందర్‌, మల్లికార్జున్‌రెడ్డి,   జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మంత్రి అల్లోల ప్రచారం

పట్టణంలోని సోమవార్‌పేట్‌, నాయుడివాడ, బంగల్‌పేట్‌ తదితర వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

నిర్మల్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: పట్టణంలోని బేస్తవార్‌పేట్‌, గాంధీనగర్‌, భాగ్యనగర్‌తో పాటు పలు వార్డులకు చెందిన సుమారు 300 మంది నాయకులు సోమవారం మంత్రి  అల్లోల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పట్టణంలోని మంత్రి   క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, నిర్మల్‌ పట్టణాభివృద్ధి పనులకు ఆకర్షితులై ఇతర పార్టీల   నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ధర్మాజి రాజేందర్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సంబురాలు

నిర్మల్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: నిర్మల్‌ మున్సిపాల్టీలోని 33వ వార్డు కౌన్సిలర్‌గా గండ్రత్‌ ఈశ్వర్‌ ఏకగ్రీవంగా ఎన్నికకావడంతో సోమవారం టీఆర్‌ఎస్‌ నాయకులు, కాలనీవాసులు సంబురాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చారు. నాయకులు ర్యాలీగా తరలివెళ్లి మంత్రి అల్లోలను కలిశారు. ఈశ్వర్‌ను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల్లో   ఏకగ్రీవంగా ఎన్నికకావడం అభినందనీయమని, మిగతా వార్డుల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావాలని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఖాయమని అన్నారు.


logo