గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Jan 14, 2020 , 00:26:22

ముందస్తు చర్యలతోనే ప్రమాదాల నివారణ

ముందస్తు చర్యలతోనే ప్రమాదాల నివారణ
  • - కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: ముందు జాగ్రత్త చర్యలతో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం సోమవారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నుంచి తమనుతాము కాపాడుకునేందుకు వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలని, ఫోర్‌ వీలర్‌ నడిపేవారు సీట్‌బెల్ట్‌ పెట్టుకోవాలని సూచించారు. త్రిబుల్‌ రైడ్‌, డ్రంకెన్‌డ్రైవ్‌, అతివేగం, ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించడంతోనే ప్రమాదాల సంభవిస్తున్నాయని అన్నారు. అలాంటి వాటిని అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని రోడ్డు రవాణా అధికారులు, పోలీసులకు సూచించారు. జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖల సహకారం ఉండాలని చెప్పారు. విద్యాశాఖ ద్వారా పాఠశాలల బస్సులను ట్రాఫిక్‌ నిబంధనల మేరకు నడిపించాలని అన్నారు.

పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని అన్నారు. గత వానాకాలంలో జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ఇచ్చోడ మండలంలోని దుబార్‌పేట్‌, గుడిహత్నూర్‌ మండలం మన్నార్‌, సీతగొంది ప్రాంతాల్లో సమస్యలు ఉత్పన్నమయ్యాయని, భవిష్యత్తులో అధిక వర్షాలతో ఆయా గ్రామాల్లో సమ్యలు రాకుండా జాతీయ రహదారుల అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వచ్చే ఫిబ్రవరి మొదటి వారంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయా శాఖల అధికారులు పూర్తి నివేదికలతో హాజరు కావాలని చెప్పారు. సమావేశంలో జిల్లా రవాణా శాఖ అధికారి పి.శ్రీనివాస్‌, ఎంవీఐ శ్రీనివాస్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


logo
>>>>>>