బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Jan 13, 2020 , 01:04:20

శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్‌ సెర్చ్‌

శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్‌ సెర్చ్‌


ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : శాంతిభద్రతల పరిరక్షణ కోసమే కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు డీస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. పట్టణంలోని రెండు కాలనీల్లో పోలీసులు ఆదివారం కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. నిజ ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. వన్‌టౌన్‌ పరిధిలోని వికలాంగుల కాలనీ, రాజరాజేశ్వరీ కాలనీల్లో డీఎస్పీ వెంకటేశ్వరారవు ఆధ్వర్యంలో 40 మంది పోలీసులతో కలిసి కాలనీని చుట్టుముట్టారు. ఇంటింటికీ వెళ్లి సోదాలు చేశారు. ఇంట్లో ఎంత మంది ఉన్నారో వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బంధువులుగా వచ్చిన ఇతర ప్రాంతాల వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆధార్‌, ఇతర ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. నిజధ్రువీకరణ పత్రాలు లేని 32 ద్విచక్రవాహనాలు, ఒక టాటాఏస్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల రక్షణ కోసమే కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నామన్నారు. బల్దియా ఎన్నికల  నేపథ్యంలో పట్టణంలో ప్రశాంత వాతావరణం కల్పించడానికి గట్టి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వాహనాలకు తప్పని సరిగా అన్ని పత్రాలు ఉండాలన్నారు. కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే 100కు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్డన్‌ సెర్చ్‌లో సీఐలు వి.సురేశ్‌, ఎస్సైలు గుణవంత్‌రావ్‌, ప్రభాకర్‌, రాజ్‌కుమార్‌, హరిబాబు, దివ్యభారతి పాల్గొన్నారు.


logo