శనివారం 04 ఏప్రిల్ 2020
Adilabad - Jan 13, 2020 , 01:01:19

నియమావళిని అనుసరించే ఉపసంహరణ

నియమావళిని అనుసరించే ఉపసంహరణ


ఎదులాపురం : నామినేషన్‌ పత్రాల ఉపసంహరణను ఎన్నికల నియమావళిని అనుసరించి నిర్వహించాలని కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా నామినేషన్‌ వేసిన అభ్యర్థి తన నామినేషన్‌ పత్రాన్ని ఉపసంహరించుకునే పక్షంలో ఎన్నికల నియమావళిని అనుసరించాలని, ఉపసంహరణ సమయంలో ఫొటో తీసుకోవాలని రిటర్నింగ్‌ అధికారులకు సూచించారు. ఉపసంహరణ సమయం అనంతరం విత్‌ డ్రా చేసుకున్న వారి వివరాలను నోటీసు బోర్డుపై అంటించాలని సూచించారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించే సమయంలో ఎన్నిక నియమావళి అనుసరించాలన్నారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా నిర్వహించాలని తెలిపారు.   సమావేశంలో సహాయ కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మారుతి, మాస్టర్‌ ట్రైనర్‌ లక్ష్మణ్‌, అస్టిసెంట్‌ కమిషనర్‌ రాజు ఉన్నారు.


logo