బుధవారం 01 ఏప్రిల్ 2020
Adilabad - Jan 12, 2020 , 01:49:01

పెరిగిన చలితీవ్రత

పెరిగిన చలితీవ్రతఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి:జిల్లాలో చలి ప్రభావం క్రమంగా పెరుగుతున్నది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ తగ్గుతున్నాయి. శనివారం జిల్లాలో 24.3 డిగ్రీల గరిష్ఠ, 9.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం 19.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా శుక్రవారం 6 డిగ్రీలు తగ్గి 13.3గా నమోదైంది. శనివారం జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. శుక్రవారం 13.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత ఉండగా శనివారం ఒక్కసారిగా 4 డిగ్రీలు తగ్గి 9.5 డిగ్రీలుగా నమోదైంది. బేలలో 8.4 డిగ్రీలు, గాదిగూడ మండలం లోకారిలో 8.4, జైనథ్‌ మండలం భోరజ్‌లో 8.7 డిగ్రీలు , భీంపూర్‌ మండలం అర్లి(టీ)లో 9.3 డిగ్రీలు, నార్నూర్‌లో 10.1 డిగ్రీలు, బోథ్‌లో 10.2 డిగ్రీలు, బజార్‌హత్నూర్‌లో 10.2 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 10.7 డిగ్రీలు, గుడిహత్నూర్‌లో 10.8 డిగ్రీలు, తలమడుగులో 10.8 డిగ్రీలు, ఇచ్చోడలో 11.3 డిగ్రీలు, మావలలో 11.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చలిప్రభావం ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. చిన్నారులు, వృద్ధులు అవస్థలు పడాల్సి వస్తున్నది. చలితీవ్రత కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, చలి నుంచి రక్షణ పొందాలని వైద్యులు సూచిస్తున్నారు.


logo
>>>>>>