ఆదివారం 29 మార్చి 2020
Adilabad - Jan 12, 2020 , 01:48:34

చత్తీస్‌గఢ్‌లో జిల్లా కళాకారుల ప్రదర్శన

చత్తీస్‌గఢ్‌లో జిల్లా కళాకారుల ప్రదర్శన


ఎదులాపురం :  ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌ ప్రాంతంలో నాలుగు రోజుల నుంచి కొనసాగుతున్న ఆట సదస్సు లాల్‌ యాత్రలో జిల్లా కళాకారులు పాల్గొన్నారు. దేశంలోని పలు రాష్ర్టాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన స్వీకృతి డ్యాన్స్‌ అకాడమీ కళాకారులు బోనాల జాతర ఉత్సవాలను ఈ సదస్సులో ప్రదర్శించి నిర్వాహకుల మన్ననలు పొందారు. స్వీకృతి డ్యాన్స్‌ అకాడమీ డ్యాన్స్‌ మాస్టర్‌ రాచర్ల మహేశ్‌, ధన్‌రాజ్‌, వేణ, నీరజ్‌ పోతురాజు, కళాకారులు కృష్ణ, సౌజన్య, ఆర్త్తీ, లతిక, మమత, రోజ  తదితరులు పాల్గొన్నారు.


logo