శనివారం 04 ఏప్రిల్ 2020
Adilabad - Jan 12, 2020 , 01:48:04

ఖాందేవుడికి ప్రత్యేక పూజలు

ఖాందేవుడికి ప్రత్యేక పూజలు


నార్నూర్‌ : పుష్యమాస సందర్భంగా ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండల కేంద్రంలో ఖాందేవ్‌ జారత అట్టహాసంగా ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి తొడసం వంశీయుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతోప్రత్యేక పూజలు చేసి జాతర ప్రారంభించారు. శనివారం ఖాందేవ్‌ ఆలయంలో తైలం తాగే మహోన్నత కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జనార్దన్‌రాథోడ్‌, ఎంపీ సోయం బాపురావ్‌, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు హాజరయ్యారు. వారికి గిరిజనులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బాబేఝరి పంచాయతీ పరిధిలోని చిత్తగూడ గ్రామానికి చెందిన ఆడపడుచు మడావి ఏత్మాబాయి సుమారు 2కిలోల నూనెను సేవించింది. తమ ఆడపడుచు నువ్వుల నూనెను సేవించడంతో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉంటారని ఇది తమ ఆచారం అని వంశ పెద్దలు తెలిపారు.  కార్యక్రమాన్ని తిలకించడానికి తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆదివాసీ మహిళలు చేసిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జనార్దన్‌రాథోడ్‌, ఆదిలాబాద్‌  ఎంపీ సోయం బాపురావ్‌, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు  మాట్లాడారు.. గిరిజన సంప్రదాయాలు గొప్పవన్నారు.  విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమన్నారు. ఖాందేవ్‌ ఆలయాభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం స్వాగత ద్వారం వద్ద కానుకలు సమర్పించారు. ఎంపీపీ కనక మోతుబాయి, పీఠాధిపతి ఖమ్ము పటేల్‌, కాటోడా తొడసం బాపురావ్‌, సర్పంచ్‌ బానోత్‌ గజానంద్‌నాయక్‌, పెసా చట్టం జిల్లా కోఆర్డినేటర్‌ వెడ్మబొజ్జు, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ తొడసం నాగోరావ్‌, తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు మెస్రం శేఖర్‌, మాజీ ఎంపీటీసీలు సురేశ్‌, బానోత్‌ జాలంసింగ్‌, ఆలయ చెర్మన్‌ మెస్రం నానాజీ, మాజీ ఎంపీపీ మెస్రం రూప్‌దేవ్‌, మడావి మాన్కు, ఫెరోజ్‌ఖాన్‌, మెస్రం మానిక్‌రావ్‌, శ్రీరామ్‌, సాగర్‌, గోపాల్‌ తదితరులు ఉన్నారు


logo